ప్రజాస్వామ్యానికి ఆయుధం ఓటరు ఐడీ : ప్రధాని మోదీ

గుజరాత్ : ఉగ్రవాదుల ఆయుధం ఐఈడీ అయితే.. ప్రజాస్వామ్యవాదుల ఆయుధం ఓటరు ఐడీ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. ఓటు హక్కు వినియోగించుకుని తన కర్తవ్యాన్ని పూర్తి చేశానన్నారు. కుంభమేళాలో పాల్గొన్నంత ఆనందం కలుగుతోందన్నారు. భారత ఓటర్లు విజ్ఞత గల వారన్నారు. తొలిసారిగా ఓటు వేస్తున్న వాళ్లకు ఆయన అభినందనలు తెలిపారు. నూటికి నూరు శాతం పోలింగ్‌ జరగాలన్నది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:37 am, Tue, 23 April 19
ప్రజాస్వామ్యానికి ఆయుధం ఓటరు ఐడీ : ప్రధాని మోదీ

గుజరాత్ : ఉగ్రవాదుల ఆయుధం ఐఈడీ అయితే.. ప్రజాస్వామ్యవాదుల ఆయుధం ఓటరు ఐడీ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. ఓటు హక్కు వినియోగించుకుని తన కర్తవ్యాన్ని పూర్తి చేశానన్నారు. కుంభమేళాలో పాల్గొన్నంత ఆనందం కలుగుతోందన్నారు. భారత ఓటర్లు విజ్ఞత గల వారన్నారు. తొలిసారిగా ఓటు వేస్తున్న వాళ్లకు ఆయన అభినందనలు తెలిపారు. నూటికి నూరు శాతం పోలింగ్‌ జరగాలన్నది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.