AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nawab Cafe Review: ‘నవాబ్ కేఫ్’ మూవీ రివ్యూ.. ఛాయ్ వాలా స్టోరీ ఎలా ఉంది? మెప్పించిందా..?

యువ హీరో శివ కందుకూరి నటించిన లేటెస్ట్ ఎమోషనల్ డ్రామా 'నవాబ్ కేఫ్'. సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల మొదట అనుకున్న 'చాయ్ వాలా' అనే టైటిల్‌ని ఈ విధంగా మార్చారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

Nawab Cafe Review: 'నవాబ్ కేఫ్' మూవీ రివ్యూ.. ఛాయ్ వాలా స్టోరీ ఎలా ఉంది? మెప్పించిందా..?
Nawab Cafe Review
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Feb 20, 2026 | 5:09 PM

Share

మూవీ రివ్యూ : నవాబ్ కేఫ్

నటీనటులు: శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల, చైతన్య కృష్ణ తదితరులు

సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి

సినిమాటోగ్రఫీ: ఈశ్వర్ పెంటి / క్రాంతి వర్ల

ఎడిటర్: పవన్ నారవ

దర్శకుడు: ప్రమోద్ హర్ష

నిర్మాతలు: రాధా వి పాపుడిప్పు, వెంకట్ ఆర్ పాపుడిప్పు

కథ:

హైదరాబాద్ పాతబస్తీలో సుమారు నాలుగు వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ‘నవాబ్ కేఫ్’ నడుపుతుంటాడు రంగనాథ్ (రాజీవ్ కనకాల). కానీ అతని కొడుకు రాజా (శివ కందుకూరి)కి తండ్రి చేసే ఈ కేఫ్ బిజినెస్ ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎలాగైనా విదేశాలకు వెళ్లి లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటాడు. అయితే కొన్ని ఊహించని పరిస్థితుల వల్ల రాజా ఇష్టం లేకపోయినా ఆ కేఫ్ బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అసలు ఈ కేఫ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అనేది మిగతా సినిమా.

కథనం:

తండ్రి ఒక బిజినెస్ చేయడం.. అది కొడుకుకు నచ్చకపోవడం.. కానీ ఆ తర్వాత అది కేవలం బిజినెస్ మాత్రమే కాదు తమ కుటుంబంతో పెనవేసుకున్న బంధమని తెలిసింది తర్వాత కొడుకు కూడా అందులోకి రావడం.. సక్సెస్ అవడం ఇలాంటి స్టోరీలు తెలుగులో చాలానే వచ్చాయి. ఇప్పుడు నవాబ్ కేఫ్ కూడా ఇదే తరహా కథతో వచ్చింది. ఫస్ట్ ఆఫ్ మొత్తం సరదాగా అలా సాగిపోతుంది. కథలోకి వెళ్లడానికి చాలా టైం తీసుకున్నాడు దర్శకుడు ప్రమోద్. ఇంటర్వెల్ కు ముందు తన లైఫ్ గోల్స్ గురించి వివరిస్తూ తండ్రితో, హీరోయిన్‌తో హీరో ఆర్గ్యుమెంట్ చేసే సీన్ చాలా బాగా పండింది. ఈ సినిమాకు బోరింగ్ స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్. కథనం అవుట్ డేటెడ్ అనిపిస్తుంది. దానికి తోడు ఫస్ట్ హాఫ్‌లో నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు, కామెడీ ట్రాక్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. లీడ్ పెయిర్ మధ్య రొమాంటిక్ ట్రాక్ ఏమంత ఆసక్తికరంగా అనిపించలేదు. చాలా కీలకమైన సన్నివేశాలు ధనుష్ లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’ని గుర్తుచేస్తాయి. డ్రామా ఎంగేజింగ్‌గా లేకపోవడం వల్ల ఆ పోలికలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు పనితనం బాగా కనిపించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ చాలా బాగా తెరకెక్కించాడు. ఆ తర్వాత నాన్నతో వచ్చే ఎమోషన్స్ కూడా బాగున్నాయి.

నటీనటులు:

శివ కందుకూరి తన పాత్రను చాలా నీట్‌గా పోషించాడు. ఫస్ట్ హాఫ్ లో జల్సాగా తిరిగే కుర్రాడిగా, సెకండ్ హాఫ్‌లో బాధ్యత గల కొడుకుగా రెండు వేరియేషన్స్‌లో బాగా నటించాడు. ఎలాంటి పాత్రలోనైనా సునాయాసంగా ఒదిగిపోయే నటుడు రాజీవ్ కనకాల. ఈ సినిమాలోనూ ఆయన తన బెస్ట్ ఇచ్చారు. కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవాలనుకునే తండ్రిగా ఆయన నటన సినిమాకు ప్రధాన బలం. చైతన్య కృష్ణ పోషించిన విలన్ పాత్ర, అతని మోటివ్ చాలా రొటీన్‌గా ఉన్నాయి. హీరోయిన్ తేజు అశ్విని పాత్రకు పెద్దగా స్కోప్ లేదు, కేవలం బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితమైంది.

టెక్నికల్ టీం:

ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం పర్వాలేదు.. ఒక పాట తెరపై చూడటానికి బాగుంది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. పాతబస్తీ వాతావరణాన్ని ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చక్కగా రీ క్రియేట్ చేసింది. నిర్మాణ విలువలు డీసెంట్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ కాస్త వీక్. చాలా చోట్ల సాగదీసినట్లు అనిపిస్తుంది, ఇంకొంత క్రిస్ప్‌గా కట్ చేయాల్సింది. దర్శకుడు ప్రమోద్ హర్ష పనితీరు జస్ట్ ఓకే. పాత కథనే ఎంచుకోవడమే ఇక్కడ మైనస్.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా నవాబ్ కేఫ్.. తండ్రీ కొడుకుల ఎమోషనల్ డ్రామా..!

Follow Us
ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్.. షెడ్యూల్
ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్.. షెడ్యూల్
అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..
అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..
ఉగాది స్పెషల్.. మృదువైన, రుచికరమైన పప్పు బక్షాలు.. ఇంట్లోనే ఈజీగా
ఉగాది స్పెషల్.. మృదువైన, రుచికరమైన పప్పు బక్షాలు.. ఇంట్లోనే ఈజీగా
బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై కేంద్రం భారీ ఊరట.. ఇకపై 24 గంటలు
బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై కేంద్రం భారీ ఊరట.. ఇకపై 24 గంటలు
పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..
పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..
యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్..
యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్..
రైళ్ల చివరి బోగీ వెనుక ఉండే 'X' గుర్తు రహస్యమిదే.. ఎవరికీ తెలియదు
రైళ్ల చివరి బోగీ వెనుక ఉండే 'X' గుర్తు రహస్యమిదే.. ఎవరికీ తెలియదు
పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
కొత్త ఏడాది ముందు గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత ధరల విలయతాండవమేనా
కొత్త ఏడాది ముందు గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత ధరల విలయతాండవమేనా