AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవ భారత నిర్మాణం కోసం ఓటేయండి: మోడీ

భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. నేను మీ కాపలాదారుడినంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. ఆశీర్వాదాల కోసం మళ్లీ మీ ముందుకొచ్చానని అన్నారు. మీ సహకారంతో ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపాను. ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేసినా మీ సహకారమే కొండంత అండ అని చెప్పారు. మీరు ఓటేసేది కేవలం ప్రధాన మంత్రి కోసం కాదు, నవ భారత నిర్మాణం కోసం ఓటేయండని ప్రధాని […]

నవ భారత నిర్మాణం కోసం ఓటేయండి: మోడీ
Vijay K
|

Updated on: Mar 29, 2019 | 3:15 PM

Share

భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. నేను మీ కాపలాదారుడినంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. ఆశీర్వాదాల కోసం మళ్లీ మీ ముందుకొచ్చానని అన్నారు. మీ సహకారంతో ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపాను. ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేసినా మీ సహకారమే కొండంత అండ అని చెప్పారు. మీరు ఓటేసేది కేవలం ప్రధాన మంత్రి కోసం కాదు, నవ భారత నిర్మాణం కోసం ఓటేయండని ప్రధాని అన్నారు.

మీరు గతంలో కాంగ్రెస్ పాలన చూశారు, 60 నెలల నా పాలన చూశారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతంగా చేశాం, అనేక విషయాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకున్నాం. మన ప్రతిభను, మన ఆత్మ విశ్వాసాన్ని ప్రపంచం గుర్తించిందని మోడీ అన్నారు. గతంలో అనేక చోట్ల హింస, విధ్వంసం చెలరేగాయి.. మా పాలనలో సామాన్యుడు నిర్భయంగా బ్రతుకుతున్నాడు. ఉగ్రవాదుల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాం అని మోడీ చెప్పారు.

Follow Us