Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

tv9 exit poll 2021: పుదుచ్చేరి అసెంబ్లీ ఫలితాలపైనే అందరి ఆసక్తి.. పరువు కోసం కాంగ్రెస్, పట్టుకోసం బీజేపీ.. సీఎం పీఠం ఎవరికో..?

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించారు. మూడువందలమంది అభ్యర్థుల భవితవ్యం మే 2వ తేదీన తేలనుంది.

tv9 exit poll 2021: పుదుచ్చేరి అసెంబ్లీ ఫలితాలపైనే అందరి ఆసక్తి.. పరువు కోసం కాంగ్రెస్, పట్టుకోసం బీజేపీ.. సీఎం పీఠం ఎవరికో..?
Puducherry Assembly Elections 2021
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 29, 2021 | 7:56 PM

Puducherry assembly election: సాధారణ ఎన్నికలకు సెమి ఫైనల్ సమరంగా సాగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇందులో భాగంగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం మూడువందలమంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల భవితవ్యం మే నెల 2వ తేదీన తేలనుంది. కాగా, పుదుచ్చేరిలో ముందెన్నడు లేనంతగా, అక్కడ రికార్డు స్థాయిలో 81.64 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని వి నారాయణ స్వామి ప్రభుత్వం విశ్వాసం కోల్పోవడంతో అసెంబ్లీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో పోటీ చేసింది, డీఎంకే 13 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపింది. మరోవైపు బిజేపీ 9, అఖిల భారత ఎన్‌ఆర్ కాంగ్రెస్ 16 స్థానాల్లో పోటీ చేసింది.

ఏప్రిల్ 30 న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడవ దశలో ఏప్రిల్ 6న ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎన్నికలకు ముందు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. పార్టీ నేతల మధ్య విబేధాల కారణంగా.. ప్రస్తుత మాజీ సీఎం వి నారాయణస్వామి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు బలపరీక్షలో కుప్పకూలింది. అప్పటి నుండి ఇక్కడ గవర్నర్ పాలనలో కొనసాగుతోంది. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శాసనసభ జూన్ 8 తో ముగుస్తుంది. 30 నియోజకవర్గాలు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీకి 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి విజయం సాధించింది. యూపీఏ మొత్తం 17 సీట్లను గెలుచుకుంది. అందులో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు గెలుచుకుని అధిపత్యాన్ని కనబర్చింది. అయితే, ఎన్నికలకు ముందే ప్రభుత్వం పార్టీ అసమ్మతి పోరు కారణంగా బలపరీక్షలో విఫలమై కుప్పకూలింది.

చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన బలపరీక్షలో విఫలమైన నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్ కుప్పకూలడంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారు. డీఎంకేతో కలిసి మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు నారాయణ స్వామి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, అధికారంలోకి వచ్చేందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించింది. అటు, అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తమిళనాడులో ప్రవేశానికి పుదుచ్చేరిని తొలి మెట్టుగా అది భావిస్తోంది. అయితే, బీజేపీ కాంగ్రెస్‌ ఎన్‌ఆర్‌, అన్నాడిఎంకెలు కలసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో పోటీ చేశాయి. ఇదిలావుంటే, పుదుచ్చేరిలో బీజేపీకి చోటివ్వరాదని కాంగ్రెస్‌,డీఎంకే, లెఫ్ట్‌ పార్టీలు కలిసి యూపీఏ కూటమిగా ఏర్పడి గట్టిగా కృషి చేశాయి. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.

పుదుచ్చేరిలో ఎన్నికల విజయం సాధించి పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ.. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ రెండు ద్రావిడ పార్టీలు – ద్రావిడ మున్నేట కజగం (డీఎంకే), అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేత్రా కజగం (ఏఐఏడీఎంకే) తమ రాజకీయ కోటను బలంగా కాపాడుకుంటున్నారు. 1967 లో కాంగ్రెస్ ఓడిపోయినప్పటి నుండి ఈ ధోరణి కొనసాగుతోంది. అయితే, ఈసారి ప్రాంతీయ పార్టీల బలం కాస్త తగ్గడంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో కలిసి ఎన్నికల బరిలో నిలిచాయి. ఇదిలావుంటే, తొలిసారిగా తమిళనాట ప్రభంజనం సృష్టించిన ముఖ్యనేతలు జయలలిత, కరుణానిధి లేకుండా జరుగిన ఎన్నికలు కావడంతో అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపైనే పడింది.

అయితే, వెలువడుతున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి చూస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అధికారం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, తుది ఫలితాల కోసం మే 2 వరకు అందరూ ఆగాల్సిందే.

Read Also… TV9 Exit Poll Results: కేంద్రపాలిత పుదుచ్చేరిలో పట్టం ఎవరికి..? ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు ఎం చెబుతున్నాయి.. ఆసక్తికర అంశాలు మీకోసం…