బండీ బడాయిలు ఆపవయా.. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం.. నీవు సిద్ధమా.. బీజేపీ ఎంపీకి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సవాల్‌

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామ రెవెన్యూ పరిధిలోని గుర్రంబోడు తండా రణరంగంగా మారిన విషయం తెలిసిందే. తండాలోని..

బండీ బడాయిలు ఆపవయా.. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం.. నీవు సిద్ధమా.. బీజేపీ ఎంపీకి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సవాల్‌
Follow us
K Sammaiah

|

Updated on: Feb 08, 2021 | 4:58 PM

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామ రెవెన్యూ పరిధిలోని గుర్రంబోడు తండా రణరంగంగా మారిన విషయం తెలిసిందే. తండాలోని 540 సర్వే నంబరులోని వివాదాస్పద భూములను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలోని బృంధం సందర్శించడానికి వచ్చినప్పుడు పరిస్థితులు లాఠీఛార్జి వరకూ వెళ్లాయి. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. రాళ్లు పోలీసు అధికారులకు తగిలాయి. ఈ ఘటనపై హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్పందించారు.

బీజేపీ త‌ల‌పెట్టిన‌ గిరిజ‌న భ‌రోసా యాత్ర ఓ వంచ‌న యాత్ర అని సైదిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీ యాత్ర‌లో స్థానికులు ఎవ‌రూ లేరని ఎమ్మెల్యే స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన బీజేపీ కార్య‌క‌ర్త‌లే హంగామా చేసి పోలీసుల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని మండిప‌డ్డారు. నాగార్జున సాగ‌ర్‌లో ఓట్ల కోసం బీజేపీ డ్రామాలు మొద‌లుపెట్టింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌ర్వే నెంబ‌ర్ 540 గురించి బీజేపీ నేత‌ల‌కు తెలుసా? అని ప్ర‌శ్నించారు.

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న‌ప్పుడు దొంగ ప‌ట్టాల‌ను ప్రోత్స‌హించారని సైదిరెడ్డి ఆరోపించారు. తాను గెలిచిన త‌ర్వాత న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేను అయిన త‌ర్వాత ఇద్ద‌రు ఎమ్మార్వోలు స‌స్పెండ్ అయ్యారు. ఉత్త‌మ్‌తో బండి సంజ‌య్ కుమ్మ‌క్కై ఇదంతా చేస్తున్నార‌ని ఎమ్మెల్యే ధ్వ‌జ‌మెత్తారు.

త‌న‌పై బండి సంజ‌య్ చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని శానంపూడి సైదిరెడ్డి తేల్చిచెప్పారు. అబ‌ద్ధ‌మైతే ఎంపీ ప‌ద‌వికి బండి సంజ‌య్ రాజీనామా చేయాల‌ని స‌వాల్ విసిరారు. బీజేపీ నేత‌ల‌కు చేత‌నైతే కేంద్రంతో మాట్లాడి గిరిజ‌నుల‌కు 12 శాతం రిజ‌ర్వేషన్లు ఇప్పించాల‌ని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి డిమాండ్ చేశారు.

Read more:

ఆయోధ్య రామమందిరానికి కులమతాలకు అతీతంగా విరాళాలు.. ఆ రాష్ట్ర క్రైస్తవ సంఘం విరాళం ఎంతో తెలుసా..?