Trs vs Bjp: బండి సంజయ్‌కి నిజంగా ప్రేమ ఉంటే ఆ పని చేయాలి.. మంత్రి కేటీఆర్ డిమాండ్..

Trs vs Bjp: తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. మాటలే కాదు.. లేఖల యుద్ధం కూడా నడుస్తోంది.

Trs vs Bjp: బండి సంజయ్‌కి నిజంగా ప్రేమ ఉంటే ఆ పని చేయాలి.. మంత్రి కేటీఆర్ డిమాండ్..
Ktr
Follow us
Shiva Prajapati

|

Updated on: May 01, 2022 | 5:32 PM

Trs vs Bjp: తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. మాటలే కాదు.. లేఖల యుద్ధం కూడా నడుస్తోంది. తెలంగాణకు కేంద్రం ఎంతో చేస్తుందంటూ ప్రచారం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈటెల్లాంటి ప్రశ్నలను సంధించి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా నేతన్నల సంక్షేమంపై బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ కీలక ప్రశ్నలు వేశారు. చరిత్రలో ఉన్నడూ లేనంత భారీగా టెక్స్‌టైల్స్ రంగానికి బడ్జెట్ కేటాయింపు చేస్తున్న ప్రభుత్వం తమదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యార్న్ సబ్సిడీ ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. ప్రత్యేక పొదుపు పథకంలో నేతన్నకు చేయూత నిస్తున్నది తమ ప్రభుత్వం అని పేర్కొన్నారు.

‘‘మా ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆత్మహత్యలు ఆగిన విషయం బండి సంజయ్‌కి కనిపించడం లేదా? ముంబై, భివండి, సూరత్ వంటి ప్రాంతాల నుంచి తెలంగాణకి కార్మికులు తిరిగి వస్తున్నది నిజం కాదా? మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలోని ఏ నేతన్నను అడిగినా చెబుతారు. నేతన్నలకు ఉన్న భీమాను ఎత్తేసిన కేంద్ర నిర్ణయంపై బండి మాట్లాడాలి. కేంద్రం భీమా ఎత్తేస్తే.. మేము ప్రత్యేకంగా నేతన్నకు భీమా కల్పిస్తున్నాము.’’ అని తన లేఖలో పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.

పార్లమెంట్‌లో ప్రత్యేక సాయం కోరాలి.. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ అయిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కి కేంద్రం నుంచి అందిన సాయంపై బండి సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ నిలదీశారు. నేతన్నలపై నిజమైన ప్రేమ బండి సంజయ్‌కు ఉంటే.. పార్లమెంట్‌లో ప్రత్యేక సాయం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నేషనల్ టెక్స్ టైల్ రిసెర్చ్ ఇన్ట్సిట్యూట్ ఏర్పాటు, చేనేతల కోసం ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీ, మెగాపవర్ లూమ్ క్లస్టర్‌ను ఏర్పాటుపై బండి తన డీల్లీ సర్కారును నిలదీయాలి అని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్.

Also read:

Solar Eclipse 2022: ప్రపంచాన్ని వణికిస్తున్న సూర్యగ్రహణం.. భయానికి కారణమిదేనా?..

Bollywood vs Sandalwood: లాంగ్వేజ్‌ లడాయి.. పొలిటికల్ టర్న్ తీసుకున్న హిందీ భాష వివాదం..

Power Crisis: దేశాన్ని అతలాకుతలం చేస్తున్న విద్యుత్ కోతలు.. అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే