యూటర్న్ తీసుకున్న టీఆర్ఎస్.. స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌లో హరీశ్

యూటర్న్ తీసుకున్న టీఆర్ఎస్.. స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌లో హరీశ్

హైదరాబాద్ : టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల విషయంలో పార్టీ యూటర్న్ తీసుకుంది. జాబితాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పేరు లేకపోవడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కేసీఆర్ వైఖరిపై హరీశ్ రావు అభిమానులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. హరీశ్‌ రావును కావాలనే దూరంపెడుతున్నారన్న ఊహాగానాలకు.. ఇది బలం చేకూర్చుతోందని ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు టీఆర్ఎస్ అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకుంది. టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సంతోష్ కుమార్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 25, 2019 | 7:38 PM

హైదరాబాద్ : టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల విషయంలో పార్టీ యూటర్న్ తీసుకుంది. జాబితాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పేరు లేకపోవడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కేసీఆర్ వైఖరిపై హరీశ్ రావు అభిమానులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. హరీశ్‌ రావును కావాలనే దూరంపెడుతున్నారన్న ఊహాగానాలకు.. ఇది బలం చేకూర్చుతోందని ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు టీఆర్ఎస్ అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకుంది. టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సంతోష్ కుమార్ స్థానంలో హరీశ్‌రావుకు చోటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించింది.

ఆదివారం టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి పార్టీ స్టార్ క్యాంపెయినర్ జాబితాను సమర్పించింది. సీఎం కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, రాష్ట్ర క్యాబినెట్‌లోని 11 మంది మంత్రులు, సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, అయిదుగురు ప్రధాన కార్యదర్శులు జె.సంతోష్‌కుమార్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్‌.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, బండా ప్రకాశ్‌, టి.రవీందర్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పేర్లను ఎన్నికల సంఘానికి పంపింది. అయితే 20 మంది జాబితాలో హరీశ్‌కు చోటు కల్పించకపోవడం టీఆర్ఎస్‌ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో లిస్టుపై పున: సమీక్ష జరిపిన కేసీఆర్.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో హరీశ్‌రావును కూడా చేర్చారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu