AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: అంబటి కోసం నల్లపాడు పీఎస్‌కు గడ్డపారతో వచ్చిన టీడీపీ కార్యకర్త..

నల్లపాడు పీఎస్ ఎదుట మద్యం మత్తులో టీడీపీ కార్యకర్త హల్‌చల్ సృష్టించాడు. గడ్డపార చేతబట్టి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన అతను “అంబటి రాంబాబు ఉన్నాడా?” అంటూ అరవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని గడ్డపారను స్వాధీనం చేసుకుని కార్యకర్తను అక్కడి నుంచి పంపించారు.

Andhra: అంబటి కోసం నల్లపాడు పీఎస్‌కు గడ్డపారతో వచ్చిన టీడీపీ కార్యకర్త..
Nallapadu Police Station
Ram Naramaneni
|

Updated on: Feb 01, 2026 | 5:51 PM

Share

నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. మద్యం మత్తులో ఉన్న ఓ టీడీపీ కార్యకర్త గడ్డపార చేతబట్టి పోలీస్‌ స్టేషన్‌కు రావడం కలకలం రేపింది. పోలీస్‌ స్టేషన్‌ ఎదుటకు వచ్చిన ఆ కార్యకర్త “అంబటి రాంబాబు ఉన్నాడా?” అంటూ గట్టిగా అరుస్తూ హడావుడి చేశాడు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్టేషన్‌లో ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. పూర్తిగా మద్యం సేవించిన స్థితిలో ఉన్న అతను చేతిలో గడ్డపార పట్టుకుని ఉండటంతో భద్రతా పరంగా ప్రమాదం ఉందని పోలీసులు గుర్తించారు. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు అతని చేతిలోని గడ్డపారను లాక్కొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తీవ్రంగా హెచ్చరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అతడిని అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనతో కొద్దిసేపు నల్లపాడు పీఎస్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేసి.. తమ మనోభావాలను గాయపరిచారని ఆ టీడీపీ కార్యకర్త ఇలా ప్రవర్తించినట్లు సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.