అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మరో ఉద్యమ కారుడు అస్తమించాడు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన డాక్టర్ కొల్లూరు చిరంజీవి (74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చిరంజీవి మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఇటీవలే తీవ్ర ఆస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు కొల్లూరి. దీంతో ఆయన కుటుంబం ఆస్పత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉందని తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. సీఎంఆర్ఎఫ్ నిధి నుంచి రూ. 10 లక్షలు మంజూరు చేయించారు. రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్వయంగా హాస్పిటల్‌కు వెళ్లి.. ప్రభుత్వ సహాయాన్ని అందజేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున కన్నుమూశారు.
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి మరణం పట్ల చిరంజీవి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. డాక్టర్‌గా ఉన్నత చదువులు చదివి సమాజం కోసం బతికిన చిరంజీవి జీవితం ఆదర్శనీయమని కేసీఆర్ కొనియాడారు.
కొల్లూరి చిరంజీవి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని, మలిదశ ఉద్యమంలోనూ తన గొంతుక వినిపించారన్నారు. చిరంజీవి మృతి తెలంగాణకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉన్నత విద్యావంతుడైన కొల్లూరి చిరంజీవి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారని… ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కేటీఆర్ అన్నారు.
Read More:
గుత్తాకు గుండె నొప్పి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు.. పరామర్శించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
కొత్తపార్టీపై ఏర్పాటుపై స్పీడ్ పెంచిన షర్మిల.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మరో కీలక అడుగు