AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తనకు ప్రాణహాని ఉందన్న టీడీపీ ఎమ్మెల్సీ.. రిమాండ్‌ నుంచి వచ్చి పది రోజులవుతున్నా సెక్యూరిటీ కల్పించలేదన్న బీటెక్‌ రవి

తనకు ప్రాణహాని ఉందని ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించాలని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి డిమాండ్‌ చేశారు. రిమాండ్‌ నుంచి బయటికి..

తనకు ప్రాణహాని ఉందన్న టీడీపీ ఎమ్మెల్సీ.. రిమాండ్‌ నుంచి వచ్చి పది రోజులవుతున్నా సెక్యూరిటీ కల్పించలేదన్న బీటెక్‌ రవి
K Sammaiah
|

Updated on: Jan 31, 2021 | 5:42 AM

Share

తనకు ప్రాణహాని ఉందని ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించాలని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి డిమాండ్‌ చేశారు. రిమాండ్‌ నుంచి బయటికి వచ్చి పది రోజులు కావస్తున్నా సెక్యూరిటీ కల్పించలేదని అన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న ఓ వ్యక్తికి భద్రత కల్పించరా అని ప్రశ్నించారు.

నను హతమార్చాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి కుట్ర పన్నారని బీటెక్‌ రవి ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు భద్రత కల్పిస్తారు నాకు మాత్రం ఎందుకు కల్పించరని బీటెక్‌ రవి ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తనకు భద్రత కల్పించాలని కోరారు. ఇక కడప జిల్లాలో ఉన్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డతో భేటీ అయిన బీటెక్‌.. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో టీడీడీ మద్దతుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

గ్రామ వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరం పెట్టాలని కోరారు. వాలంటీర్ల వద్ద ఉన్న సిమ్‌ కార్డులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఎస్‌ఈసీని కోరామని బీటెక్‌ రవి చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలకు రక్షణ కల్పించాలని కోరినట్లు వివరించారు. కడప జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా జరిపాలని కోరినట్లు చెప్పారు.

కల్లూరులో టెన్షన్‌.. టెన్షన్‌.. ఏకగ్రీవంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. పరస్పరం కర్రలతో దాడి