నిమ్మగడ్డపై మొదటి నుంచి చెబుతుందే నిజమైంది.. చంద్రబాబు ఏజెంట్‌లా పని చేస్తున్నారన్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ప్రభుత్వ చీఫ్ విప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తి స్థాయిలో
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ప్రభుత్వ చీఫ్ విప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తి స్థాయిలో రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నట్లు మేము చెపుతూనే వస్తున్నాం. రాజ్యాంగ పదవిలో ఉంటూ ఒక పార్టీకి మేలు చేయాలపూ ఉద్దేశంతో మరొక పార్టీకి కీడు చేసే విదంగా నిమ్మగడ్డ రమేష్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమి మాట్లాడుతున్నాడో ప్రజలు అంత గమనిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. కడప జిల్లాలో పర్యటించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ డివంగతనేత వైయస్సార్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలచేత ఎన్నుకోబడిన పార్టీ పై అనునిత్యం నిందనలు మోపుతూ సుజనా చౌదరి వంటి నాయకులతో నిరంతరం హోటళ్లలో మంత్రాంగాలు నెరుపుతున్నట్లు అడ్డంగా దొరికిన విషయం మరిచిపోయి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.
రాజ్యాంగ బద్దంగా ఎన్నికల విధి విధానాలు ను మేము గౌరవిస్తాం తప్ప నిమ్మగడ్డ రెమెష్ కుమార్ ను కాదన్నారు శ్రీకాంత్‌రెడ్డి. 2001 లో ఏకగ్రీవాల జీవో తెచ్చిందే ప్రతి పక్ష నేత చంద్ర బాబేనని గుర్తు చేశారు. శాసన సభ,లోకసభ ఎన్నికలలో మేనిఫెస్టో ప్రవేశపెట్టడం చూశాం.. కానీ ప్రతిపక్షంలో ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి చేస్తామంటూ మేనిఫెస్టోను విడుదల చేయడం ఎక్కడా చూడలేని ఎద్దేవా చేశారు.