టీడీపీకి భారీ షాక్.. కురుపాం అభ్యర్ధి నామినేషన్ తిరస్కరించిన ఈసీ

విజయనగరం : టీడీపీకి ఎన్నికలకు ముందే భారీ షాక్ తగిలింది. కురుపాం నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున నిలబడిన అభ్యర్ధి జనార్దన్‌ థాట్రాజ్‌ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆయన నామినేషన్‌లో తప్పులు ఉన్నాయని బీజేపీ అభ్యర్ధి నిమ్మక జయరాజ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి నిమ్మక సింహాచలం రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. 2013 నాటి ఎస్టీ ధ్రువీకరణ పత్రం ఎలా తీసుకున్నారని వారు ప్రశ్నించారు. థాట్రాజ్‌ ఎస్టీకాదంటూ హైకోర్టు, సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వు ప్రతులను ప్రత్యర్థులు […]

టీడీపీకి భారీ షాక్.. కురుపాం అభ్యర్ధి నామినేషన్ తిరస్కరించిన ఈసీ
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2019 | 8:09 PM

విజయనగరం : టీడీపీకి ఎన్నికలకు ముందే భారీ షాక్ తగిలింది. కురుపాం నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున నిలబడిన అభ్యర్ధి జనార్దన్‌ థాట్రాజ్‌ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆయన నామినేషన్‌లో తప్పులు ఉన్నాయని బీజేపీ అభ్యర్ధి నిమ్మక జయరాజ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి నిమ్మక సింహాచలం రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. 2013 నాటి ఎస్టీ ధ్రువీకరణ పత్రం ఎలా తీసుకున్నారని వారు ప్రశ్నించారు. థాట్రాజ్‌ ఎస్టీకాదంటూ హైకోర్టు, సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వు ప్రతులను ప్రత్యర్థులు ఆర్వోకు చూపించారు. దీనిపై అధికారులు విచారణ జరిపి థాట్రాజ్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన తల్లి నరసింహ ప్రియా థాట్రాజ్‌ వేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు అంగీకరించే అవకాశముంది.