AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్ర స్టార్ క్యాంపెయినర్‍గా ప్రియాంక‌

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో తూర్పు యూపీ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ పేరును చేర్చే యోచనలో అధిష్ఠానం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆమె ముంబాయిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు విడతలుగా జరగబోయే ఎన్నికల్లో మహారాష్ట్ర స్టార్ క్యాంపెయినర్స్‌గా కాంగ్రెస్ 40 మంది జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్, జ్యోతిరాదిత్యా సింధియాతో […]

TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 26, 2019 | 8:15 PM

Share

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో తూర్పు యూపీ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ పేరును చేర్చే యోచనలో అధిష్ఠానం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆమె ముంబాయిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు విడతలుగా జరగబోయే ఎన్నికల్లో మహారాష్ట్ర స్టార్ క్యాంపెయినర్స్‌గా కాంగ్రెస్ 40 మంది జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్, జ్యోతిరాదిత్యా సింధియాతో పాటు అజారుద్దీన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు షిండే, శివరాజ్ పాటిల్, అశోక్ చవాన్, ముకుల్ వాస్నిక్, విలాస్ ముత్తెంవార్, మిలింద్ దేవరా లాంటి స్థానిక నేతలను కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఈ జాబితాలో చేర్చింది.

Follow Us