కేఏ పాల్ ఆస్తుల లెక్క ఎంతంటే..!

ఈ మధ్యకాలం మీడియాలో ఎక్కడ చూసినా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సందడి చేస్తున్నారు. గెలుపు సంగతి ప్రక్కన పెడితే.. ఆయన మాటలు.. ఆయన చేష్టలతో ఏపీలో వాడివేడిగా ఉన్న వాతావరణాన్ని కాస్తంత కూల్ చేస్తున్నారనే చెప్పాలి. ఎన్నికల బరిలో తన సత్తా చాటుతానని.. తాను ఏపీకి కాబోయే సీఎంనని చెప్పే కేఏ పాల్ నామినేషన్ ను ఎన్నికల అధికారులు ఎట్టికేలకు ఓకే చేశారు. ఇదిలా ఉంటే ఆయన ఆస్తులకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు […]

కేఏ పాల్ ఆస్తుల లెక్క ఎంతంటే..!
Follow us

|

Updated on: Mar 27, 2019 | 12:40 PM

ఈ మధ్యకాలం మీడియాలో ఎక్కడ చూసినా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సందడి చేస్తున్నారు. గెలుపు సంగతి ప్రక్కన పెడితే.. ఆయన మాటలు.. ఆయన చేష్టలతో ఏపీలో వాడివేడిగా ఉన్న వాతావరణాన్ని కాస్తంత కూల్ చేస్తున్నారనే చెప్పాలి. ఎన్నికల బరిలో తన సత్తా చాటుతానని.. తాను ఏపీకి కాబోయే సీఎంనని చెప్పే కేఏ పాల్ నామినేషన్ ను ఎన్నికల అధికారులు ఎట్టికేలకు ఓకే చేశారు. ఇదిలా ఉంటే ఆయన ఆస్తులకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తన పేరుతో ఎలాంటి ఆస్తులు లేవని.. ఉన్న ఆస్తుల్ని ఛారిటబుల్ ట్రస్ట్ కు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నాడట. ఇకపోతే కేఏ పాల్ కు సొంతంగా హెలికాఫ్టర్ ఉందని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే.. తన హెలికాఫ్టర్ ను.. తనకున్న ఆస్తుల్ని ఛారిటబుల్ ట్రస్ట్ కు ఇచ్చేసినట్లు ఆయన వెల్లడించాడట. తన పేరున సొంత సైకిల్ కూడా లేదని పాల్ చెప్పడం గమనార్హం. కాకపోతే ఆయనకు అప్పులు మాత్రం కొన్ని ఉన్నట్లు పేర్కొన్నాడట. క్రెడిట్ కార్డు బకాయిల రూపంలో ఆయన 2 వేల అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన భార్య పేరు మీద మరో వెయ్యి డాలర్ల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ఇంత పేరున్న కేఏ పాల్ కు సొంతంగా ఆస్తులు ఏమి లేవు అని తెలియడంతో కొంతమంది ఆశ్చర్యపోతున్నారు.