మొదలైన రెండో దశ పోలింగ్ పోరు..

దేశవ్యాప్తంగా రెండో దశ లోక్‌సభ పోలింగ్ ప్రారంభమైంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 95 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా.. 1644 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వాస్తవానికి 97 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉన్నా.. వెల్లూరులో పోలింగ్ రద్దైంది. మరో నియోజక వర్గం త్రిపుర తూర్పులో మూడో దశ పోలింగ్ ఈ నెల 23న నిర్వహిస్తారు. తమిళనాడులో అత్యధికంగా 38, కర్నాటకలో 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. […]

మొదలైన రెండో దశ పోలింగ్ పోరు..

దేశవ్యాప్తంగా రెండో దశ లోక్‌సభ పోలింగ్ ప్రారంభమైంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 95 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా.. 1644 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వాస్తవానికి 97 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉన్నా.. వెల్లూరులో పోలింగ్ రద్దైంది. మరో నియోజక వర్గం త్రిపుర తూర్పులో మూడో దశ పోలింగ్ ఈ నెల 23న నిర్వహిస్తారు.

తమిళనాడులో అత్యధికంగా 38, కర్నాటకలో 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ దఫాలో ఉత్తర ప్రదేశ్‌లో 8 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. జమ్మూకాశ్మీర్‌లో 2 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా.. అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నందున 80 కంపెనీలకు చెందిన భద్రతా బలగాలు మోహరించాయి.

ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు వరకు కొనసాగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ ముగిస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలు మోహరించాయి. ఈ రెండో దఫాలో జితేంద్ర సింగ్, జ్యుయల్ ఓరం, సదానంద గౌడ, పోన్ రాధాకృష్ణ, మాజీ ప్రధాని దేవే గౌడ, డీఎంకే నేతలు, దయానిధి మారన్, డి.రాజా, కనిమొళి వంటి ప్రముఖులు పోలింగ్ బరిలో ఉన్నారు.

ఇక తమిళనాడులో 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 269 మంది పోటీ పడుతున్నారు. మధురైలో రాత్రి 8 గంటల వరకు పోలింగ్‌కు అనుమతి ఇచ్చింది ఎన్నికల సంఘం. తమిళనాడులో ఎన్నికల సందర్భంగా థియేటర్లను బంద్ చేయించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu