రాప్తాడులో టీడీపీ, వైసీపీ నేతల పరస్పర ఫిర్యాదులు

ఎన్నికల తేది దగ్గరపడుతోన్న వేళ ఏపీలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ప్రత్యర్థులపై విమర్శల మాట అటుంచితే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తాజాగా రాప్తాడులో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. దౌర్జన్యాలు, అరాచకాలు మీవంటే.. మీవంటూ టీడీపీ నేత పరిటాల సునీత, వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపణలు చేసుకున్నారు. తోపుదుర్తి సోదరులు.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ సునీత ఆరోపణలు చేశారు. ఇటీవల వైసీపీ నేత రాజశేఖర్ రెడ్డి వాహనంలో కర్రలు, మారణాయుధాలు […]

రాప్తాడులో టీడీపీ, వైసీపీ నేతల పరస్పర ఫిర్యాదులు

Edited By:

Updated on: Apr 02, 2019 | 2:05 PM

ఎన్నికల తేది దగ్గరపడుతోన్న వేళ ఏపీలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ప్రత్యర్థులపై విమర్శల మాట అటుంచితే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తాజాగా రాప్తాడులో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. దౌర్జన్యాలు, అరాచకాలు మీవంటే.. మీవంటూ టీడీపీ నేత పరిటాల సునీత, వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపణలు చేసుకున్నారు.

తోపుదుర్తి సోదరులు.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ సునీత ఆరోపణలు చేశారు. ఇటీవల వైసీపీ నేత రాజశేఖర్ రెడ్డి వాహనంలో కర్రలు, మారణాయుధాలు దొరికాయని.. ఓట్లు వేయకపోతే గ్రామాల్లో ప్రజలను తిరగనివ్వమంటూ  బెదిరిస్తున్నారని పరిటాల సునీత ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

మరోవైపు మా సోదరులను చంపేందుకు పరిటాల కుటుంబం ప్రయత్నిస్తోందని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపణలు చేశారు. గత ఐదేళ్లలో పరిటాల సునీత కుటుంబసభ్యులు ఎన్నో అరాచకాలు చేశారని.. నలుగురు వైసీపీ కార్యకర్తలను తుదముట్టించారని ప్రకాశ్ ఫిర్యాదు చేశారు. పరిటాల సునీత కుటుంబసభ్యులు, టీడీపీ నేతల అరాచకాల గురించి సాక్ష్యాధాలతో ఎస్పీకి ఫిర్యాదు చేశామని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us