సద్గురు చిట్కాలు.. ఇలా చేస్తే ప్రతి కూల ఆలోచనలు శాశ్వతంగా తొలిగిపోతాయి

Samatha

26  september 2026

Pic credit - Pinterest

సద్గురు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా గొప్ప విషయాలను తెలియజేయడం జరిగింది.

సద్గురు

ప్రతి వ్యక్తి జీవించే విధానం, పాటించాల్సిన నియమాలు, ఇలా ఎన్నో విషయాల గురించి సద్గురు తన మాటల ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే.

జీవించే విధానం

అదే విధంగా ఆయన ఒక వ్యక్తి తనలోని ప్రతికూల ఆలోచనలు ఎలా దూరం చేసుకోవాలి? సానుకూలతను ఎలా పెంపొందించుకోవాలో తెలియజేశాడు.

ప్రతికూల ఆలోచనలు

ఉదయాన్ని సరిగ్గా ప్రారంభించడం రోజంతా సానుకూలంగా, శక్తివంతంగా ఉండేలా చేస్తుందని యోగా గురువు సద్గురు తెలియజేయడం జరిగింది.

ఉదయాన్ని సరిగ్గా పాటించడం

ఆధ్యాత్మిక గురువు సద్గురు ప్రకారం, ఉదయాన్ని సరిగ్గా ప్రారంభించడం వల్ల రోజంతా శక్తి, ఆనందం, ఏకాగ్రత లభిస్తాయి. ఎప్పుడూ ఒత్తిడితో నిద్రలేవకూడదంట.

ఆనందం, ఏకాగ్రత

కొంత మంది ఉదయం హఠాత్తుగా నిద్రలేస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా అలా చేయకూడదంట. దీని వలన రోజు మొత్తం గందరగోళంగా ఉంటుంది.

హఠాత్తుగా నిద్రలేవడం

ఎప్పుడూ కూడా కుడివైపు నుంచి నిద్రలేవాలి. నిద్రలేవగానే అరచేతులను రుద్దాలి. దీని వలన చేతులలో ఉండే నరాలు ఉత్తేజితం అవుతాయి.

కుడివైపుకు నిద్రలేవడం

ఉదయం నిద్రలేచినప్పుడు, బతికి ఉండటమే గొప్ప వరం అని ఆలోచించండి. దేవునికి లేదా ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, చిరునవ్వుతో మీ రోజు ప్రారంభించాలి.

కృతజ్ఞతలు