తమిళనాడులో కొనసాగుతోన్న రాహుల్‌గాంధీ టూర్‌.. రోడ్డుషోలతో హోరెత్తిస్తున్న ఎన్నికల ప్రచారం

తమిళనాడులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పర్యటన కొనసాగుతుంది. రోడ్‌షోల ద్వారా ఆయన ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోదీనే లక్ష్యంగా..

  • K Sammaiah
  • Publish Date - 12:26 pm, Mon, 25 January 21
తమిళనాడులో కొనసాగుతోన్న రాహుల్‌గాంధీ టూర్‌.. రోడ్డుషోలతో హోరెత్తిస్తున్న ఎన్నికల ప్రచారం

తమిళనాడులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పర్యటన కొనసాగుతుంది. రోడ్‌షోల ద్వారా ఆయన ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోదీనే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళనాడు లాంగ్వేజ్, కల్చర్, హిస్టరీని మోడీ అర్థం చేసుకోలేదన్నారు. కోయంబత్తూర్, ఈరోడ్ లతో పాటు తిరుపూర్, కరూర్, దిండిగల్ జిల్లాల్లో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.

నా మన్ కీ బాత్ చెప్పేందుకు రాలేదు. మీ కష్టాలను విని అర్థం చేసుకునేందుకు, వాటిని పరిష్కరించేందుకే వచ్చాను అని తమిళనాడు ప్రజలతో రాహుల్ మమేకమవుతున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా రిపబ్లిక్ డే రోజున రైతులు ర్యాలీ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు రాహుల్‌. రైతుల భవిష్యత్తును, వారి నోటికాడి బుక్కను లాక్కోవాలని చూస్తున్నందుకే వారు ఆందోళనలు చేస్తున్నారని రాహుల్‌ అన్నారు. తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా కంట్రోల్ చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు.

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ కలెక్షన్లలో బిజీగా ఉందని రాహుల్‌ ట్విట్టర్ లో విమర్శించారు. ‘‘మోడీజీ జీడీపీ (గ్యాస్, డీజిల్, పెట్రోల్) ధరల విషయంలో అద్భుతమైన వృద్ధిని సాధించారు’’ అంటూ ట్వీట్ చేశారు రాహుల్‌.