Punjab Politics: ఎన్నికలకు ఏడాది ముందుగా..పంజాబ్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు..దళిత ఓట్లు లక్ష్యంగా కొత్త కూటమి!
Punjab Politics: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పంజాబ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) కటీఫ్ చెప్పేసింది.
Punjab Politics: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పంజాబ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) కటీఫ్ చెప్పేసింది. రెండు నెలల క్రితమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసినట్టు ప్రకటించిన ఎస్ఏడీ ఇప్పుడు బీఎపీతో పొత్తుకు సిద్ధం అయింది. రెండునెలలుగా జరిగిన అనేక చర్చల అనంతరం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారు అయింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికైతే రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారు అయినట్టే అనీ, ఇక సీట్ల లెక్కలే తేలాల్సి ఉందని పంజాబ్ లోని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
గతంలో బీజేపీకి ఇచ్చిన పరిమిత సీట్లే ఇప్పుడు బీఎస్పీ కి కూడా ఇవ్వాలని శిరోమణి అకాలీదళ్ భావిస్తోంది. అయితే, బీఎస్పీ ఇంకా ఎక్కువ సీట్లు కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇది సుమారు 30% సీట్లు, అంటే 37 నుండి 40 సీట్లు డిమాండ్ చేస్తోంది, కాని ఎస్ఏడీ కేవలం 18 సీట్లు మాత్రమే ఇవ్వాలనుకుంటోంది. కూటమిలో రెండు, నాలుగు సీట్లను వదులుకోవాల్సి వస్తే, దానికి మేము సిద్ధంగా ఉన్నామని బీఎస్పీ పంజాబ్ ఇన్‌ఛార్జి రణధీర్ సింగ్ బైనిపాల్ మీడియాకు చెప్పారు. మరోవైపు, ఈ విషయంలో ఎస్ఏడీ ఒక వ్యూహాన్ని సిద్ధం చేస్తోందని ఎస్ఏడీకి చెందిన డాక్టర్ దల్జిత్ సింగ్ చీమా అన్నారు.
33% దళిత ఓటు బ్యాంకుపై కన్ను..
రాష్ట్రంలో దళితులను నిర్లక్ష్యం చేశారని వివిధ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇటీవల, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అంతర్గత గొడవ సమయంలో కూడా వివిధ నాయకులు హైకమాండ్ కమిటీ ముందు లేవనెత్తారు. రాష్ట్రంలో దళితుల గురించి ఎవరూ వినడం లేదని వారు అన్నారు. దళిత ఎమ్మెల్యే వినికిడి లేనప్పుడు, సామాన్య ప్రజలకు ఉపయోగం ఏం జరుగుతుందని వారు ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో ఈసారి అన్ని పార్టీలకు 33% దళిత ఓటు బ్యాంకుపై ప్రత్యేక దృష్టి ఉంది. అందుకే అన్ని పార్టీలు దళిత నాయకులకు అనుకూలంగా బిజీగా మారిపోయాయి.
దళిత డిప్యూటీ సిఎం..
ఇటీవల శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్ దళితను డిప్యూటీ సిఎంగా చేస్తామని ప్రకటించారు. ఎందుకంటే, రాష్ట్రంలో బీఎస్పీ నాయకుల్లో ఎక్కువ మంది దళితులు ఉన్నారు. కనుక ఈ ప్రకటన కొత్తగా ఏర్పాటు చేస్తున్న కూటమి ప్రయోజనాన్ని సూచిస్తోంది. దీనిద్వారా బీఎస్పీకి డిప్యూటీ సీఎం పదవి దక్కే ఛాన్స్ ఉండనే భావన ప్రజల్లోకి వెళుతుంది. రాష్ట్రంలోని తన పార్టీ, దళిత నాయకుల స్థితిగతులను తెలుసుకోవటానికి, అకాలీదళ్ రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక సర్వే నిర్వహిస్తోంది. దీనిలో ఏ ప్రాంతంలో, ఎంత మంది దళిత నాయకుల మద్దతుదారులు, ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుస్తుంది. వీటిలో ఎన్ని వారు పొందవచ్చు అనే అంశం తెలిసే అవకాశం ఉంది. అదే సమయంలో, శిరోమణి అకాలీదళ్ కూడా తన పార్టీ స్థితిని అంచనా వేస్తోంది.
దళిత ముఖ్యమంత్రి.. బీజేపీ ప్లాన్..
దళితుల మద్దతు పొందడానికి, రాష్ట్ర బీజేపీ కూడా దళిత సీఎం చేయడానికి ప్రకటించింది. కొత్త కూటమి సన్నాహాలు దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ ప్రకటన చేసిందని భావిస్తున్నారు. మరోవైపు, దళితులు లేవనెత్తిన ప్రశ్నలకు ముగింపు పలకడం కూడా ఈ ప్రకటన ముఖ్య ఉద్దేశ్యంలా కనిపిస్తోంది. అయితే, బహుజన్ సమాజ్ పార్టీతో జతకట్టడం ద్వారా శిరోమణి అకాలీదళ్ దళితులను ఆకర్షించడంలో పై చేయి సాధించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం తరువాత, రాష్ట్రంలోని ఇతర పార్టీలకు ఎన్నికలలో దళితులకు ఎంత మద్దతు లభిస్తుందో చూడాల్సి ఉంటుంది.
Farm Laws: రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధమే.. కానీ ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు: కేంద్రమంత్రి తోమర్