AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ కంచుకోటకు ప్రధాని మోదీ

లక్నో: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ  ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రోజుకో రాష్ట్రం చొప్పున దేశమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కీలకంగా మారిన ఉత్తరప్రదేశ్‌పై మోదీ ప్రత్యేక దృష్టిసారించారు. ఇటీవల వారణాసిలో పర్యటించిన మోదీ ఆదివారం అమేథిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథిలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ తరువాత తొలిసారి అడుగుపెట్టనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం.. కుహ్వారా ప్రాంతంలో జరిగే బహిరంగ సభలో […]

కాంగ్రెస్ కంచుకోటకు ప్రధాని మోదీ
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 06, 2019 | 7:28 PM

Share

లక్నో: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ  ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రోజుకో రాష్ట్రం చొప్పున దేశమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కీలకంగా మారిన ఉత్తరప్రదేశ్‌పై మోదీ ప్రత్యేక దృష్టిసారించారు. ఇటీవల వారణాసిలో పర్యటించిన మోదీ ఆదివారం అమేథిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథిలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ తరువాత తొలిసారి అడుగుపెట్టనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం.. కుహ్వారా ప్రాంతంలో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. మోదీ సభకు ఏర్పాట్లను యూపీ సీఎం యోగి  ఆదిత్యానాధ్‌ పరిశీలించారు. సభకు లక్షకు పైగా కార్యకర్తలు హాజరవుతారని బీజేపీ వర్గాలు ప్రకటించాయి.

దశాబ్దాలుగా గాంధీ కుటుంబమే ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథిపై బీజేపీ ప్రత్యేక దృష్టిని సారించింది. దానిలో భాగంగానే బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ స్మృతి ఇరానీని గత ఎన్నికల్లో రాహుల్‌పై పోటీకి నిలిపింది. స్వల్ప ఓట్ల తేడాతో ఆమెపై రాహుల్‌ విజయం సాధించారు. ఈసారి ఎలానైనా విజయం సాధించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. యూపీలో ఎక్కువ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో గత ఎన్నికల్లో ఓటమి చెందిన స్థానాలపై బీజేపీ మరింత దృష్టి సారించింది. దానిలో భాగంగానే యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రామబరేలిలో గత ఏడాది మోదీ పర్యటించారు. మోదీ చివరిసారిగా 2014 మే 4న ఆమేథిలో పర్యటించిన విషయం తెలిసిందే.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు కంచన్‌బాగ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు కంచన్‌బాగ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం