Prakash Raj: అంతకు మించే ప్రాధాన్యం.. సీఎం కేసీఆర్ కీలక సూచన.. కారుతో కలిసి పొలిటికల్ జర్నీకి ప్రకాశ్‌రాజ్ ఫిక్స్..
విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్(Prakash Raj) జాతీయ రాజకీయాల్లో(political journey) ప్రకాశించబోతున్నారా? రాజకీయాల్లో కారు(TRS) జర్నీకి పూర్తిగా సంసిద్ధమైన ఆయనకు... గులాబీ దళపతి మరింత ప్రాధాన్యత ఇవ్వబోతున్నారా? కీలక పదవినే కట్టబెడతారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో ఇలాంటి చర్చే జరుగుతోంది.
సినిమాల్లో తనదైన యాక్టింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రకాశ్‌రాజ్(Prakash Raj).. కొన్నేళ్లుగా రాజకీయంగానూ రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019లో కర్నాటక నుంచి లోక్‌సభకు పోటీ చేసినా ఓడినా.. తన ప్రయత్నాలు ఆపలేదు. ఇప్పుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ రాజకీయాలవైపు(political journey ) చూస్తుండటం.. ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం.. ప్రకాశ్‌రాజ్‌కు రాజకీయంగా పెద్ద పనే కల్పించినట్టు తెలుస్తోంది. మొదట్నుంచీ సీఎం కేసీఆర్‌తో సన్నిహితంగా ఉన్న ప్రకాశ్‌రాజ్… త్వరలోనే టీఆర్‌ఎస్ తరపున రాజ్యసభకు నామినేట్ అవుతారనే ప్రచారం జరిగింది. అయితే, తనతో జాతీయస్థాయిలో కలిసి నడిచేందుకు సిద్ధమైన ప్రకాశ్‌రాజ్‌కు.. అంతకు మించే రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. తనది పీపుల్స్ ఫ్రంట్ అని ప్రకటించిన కేసీఆర్.. కలిసివచ్చేవారికి ఆహ్వానాలు పంపుతున్నారు.
తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే సహా పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరిపారు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో సంప్రదింపులు, సమస్వయం చేసేలా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కేసీఆర్. నేషనల్ కొఅర్టినేషన్ కమిటి పేరుతో ఏర్పాటు కానున్న ఈ టీమ్… పీపుల్స్ ఫ్రంట్ భాగస్వాములతో నిరంతరం టచ్‌లో ఉంటుంది. భవిష్యత్ కార్యాచరణపై నిరంతరం చర్చలు జరుపుతుంది.
త్వరలో కేసీఆర్ ఏర్పాటు చేయబోయే జాతీయ స్థాయి సమావేశాలను కూడా ఈ కమిటీ సమన్వయం చేయనుంది. దేశరాజకీయాల్లో గతంలోనూ చాలా కూటములు ఏర్పడినా.. అందులోని పార్టీల కో ఆర్డినేషన్ కోసం ఒక సెంటర్ పాయింట్ అనేది ఉండేది కాదు. అధికారం చేపట్టడం, లేదంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం మాత్రమే లక్ష్యంగా.. ఢిల్లిలో కూటమి భాగస్వాముల సమావేశాలు జరిగేవి.
అయితే, కేసీఆర్ ఢిల్లీలో ఈ కమిటీకి ఓ కార్యాలయం ఏర్పాటు చేసి.. నిరంతరం పనిచేసేలా కసరత్తులు చేస్తున్నారు. పీపుల్స్ ఫ్రంట్‌కు ఓ కేరాఫ్ అడ్రస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఇంత కీలకమైన కమిటిని నిర్వహించే భాద్యతలను ప్రకాశ్ రాజ్, ప్రశాంత్ కిషోర్‌లకు అప్పగించనున్నారు సీఎం.
యాక్టర్‌గా ఆలిండియాలో ప్రకాశ్‌రాజ్‌కు పాపులారిటీ ఉంది. పలు రాష్ట్రాల సీఎంలు, ప్రాంతీయ పార్టీల అధినేతలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. నార్త్ లీడర్స్‌తో ప్రశాంత్ కిషోర్‌కు మంచి రిలేషన్ ఉంది. అందుకే, కూటమి సమన్వయ బాధ్యతల్ని ఈ ఇద్దరికే అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీరికి కొందరు ఎంపీలు, పార్టి నేతలు కూడా తోడుగా ఉండనున్నారు. త్వరలో జరగబోయే మాజీ ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల సమావేశంతో ఈ కమిటీ పని ప్రారంభించనుంది.
ఇవి కూడా చదవండి: Uric Acid Problem: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. సొరకాయ సూప్‌తో చెక్ పెట్టండి.. ఎలా తయారు చేయాలంటే..