రేవంత్‌పై పోసాని ఫైర్.. లంచం ఇస్తూ రెడ్‌హ్యాండ్‌గా దొరికిన వ్యక్తి అంటూ..!

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిపై నటుడు పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. రూ.50 లక్షలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వ్యక్తి, జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి కేటీఆర్‌ అవినీతి పరుడని అనడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

రేవంత్‌పై పోసాని ఫైర్.. లంచం ఇస్తూ రెడ్‌హ్యాండ్‌గా దొరికిన వ్యక్తి అంటూ..!
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 7:12 PM

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిపై నటుడు పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. రూ.50 లక్షలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వ్యక్తి, జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి కేటీఆర్‌ అవినీతి పరుడని అనడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మాటలు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయని వెల్లడించారు. ఎవరు మంచివాళ్లో తనకు తెలుసని ఆయన అన్నారు. కేటీఆర్, హరీశ్ రావు నూటికి నూరు శాతం నిజాయతీ పరులని.. తెలంగాణ భవిష్యత్తుకు వారు రెండు కళ్లలాంటి వారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక కేటీఆర్ అవినీతి చేశారని నిరూపిస్తే, తన మాటలు వెనక్కి తీసుకొని, టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని పోసాని పేర్కొన్నారు. రూ.80 వేల కోట్లు ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేశారని, అంత గొప్ప ప్రాజెక్ట్‌ని ప్రతిపక్షం కూడా అభినందించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ కట్టినప్పుడు ప్రతిపక్షం అభినందించిందని ఆయన గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి నాయకుడని, ఆయన పక్కన నిజాయితీ పరులుంటే మంచిదని వ్యాఖ్యానించారు.

రెండు రాష్ట్రాల్లో సమర్ధులైన ముఖ్యమంత్రులు ఉన్నారని పోసాని కితాబిచ్చారు. జగన్ ప్రజల మధ్య ఉండే నాయకుడని, మరో పదిహేనేళ్లు ఏపీలో వైసీపీనే అధికారంలో ఉంటుందని అన్నారు. బాలకృష్ణ చాలా నిజాయితీపరుడని, ఆయన కోపం నిమిషం మాత్రమేనని పోసాని పేర్కొన్నారు.

Read This Story Also: Breaking: అర్జున్ మేనల్లుడు, నటుడు చిరంజీవి హఠాన్మరణం..!

Latest Articles
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్