AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పద్మ పాపులారిటీకి గండికొట్టిన ఎమ్మెల్సీ..!

పద్మా దేవేందర్ రెడ్డి. టీఆర్ఎస్ నుంచి మొదట జడ్పీటీసీగా గెల్చి.. ఆపై ఎమ్మెల్యేగా, అనంతరం డిప్యూటీ స్పీకర్‌గా ఎదిగిన నాయకురాలు. గత అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన పద్మా దేవేందర్ రెడ్డి ఈ సారి కేబినెట్‌లో స్థానం ఆశించారట. మహిళా ఎమ్మెల్యే. పైగా పార్టీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలందరిలో సీనియర్. అందులోనూ డిప్యూటీ స్పీకర్‌గా అప్పటికే పనిచేసి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మంత్రిపదవి గ్యారెంటీ అని భావించారట. కానీ.. జరిగింది వేరు. అనేక సమీకరణల నేపథ్యంలో […]

పద్మ పాపులారిటీకి గండికొట్టిన ఎమ్మెల్సీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 20, 2019 | 3:35 PM

Share

పద్మా దేవేందర్ రెడ్డి. టీఆర్ఎస్ నుంచి మొదట జడ్పీటీసీగా గెల్చి.. ఆపై ఎమ్మెల్యేగా, అనంతరం డిప్యూటీ స్పీకర్‌గా ఎదిగిన నాయకురాలు. గత అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన పద్మా దేవేందర్ రెడ్డి ఈ సారి కేబినెట్‌లో స్థానం ఆశించారట. మహిళా ఎమ్మెల్యే. పైగా పార్టీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలందరిలో సీనియర్. అందులోనూ డిప్యూటీ స్పీకర్‌గా అప్పటికే పనిచేసి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మంత్రిపదవి గ్యారెంటీ అని భావించారట. కానీ.. జరిగింది వేరు. అనేక సమీకరణల నేపథ్యంలో కేబినెట్‌లో బెర్త్ దక్కలేదు. ఎమ్మెల్యేగానే మిగిలారు. హోదా తగ్గినా.. ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే కదా అంటూ సర్దుకుపోయే ప్రయత్నం చేశారట పద్మా దేవేందర్ రెడ్డి. కానీ అంతలోనే మరో షాక్ తగిలిందట.

అసలే మంత్రి పదవి రాలేదన్న నిరాశలో ఉన్నవేళ.. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి రూపంలో కొత్త సమస్య వచ్చిపడిందట. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మెదక్ నియోజకవర్గానికి చెందిన నేత. సీఎంకి, ఆయన కుటుంబానికి సన్నిహితుడన్న పేరు ఉంది. ప్రోటోకాల్ పరంగా మెదక్ జిల్లానే ఎంచుకోవడంతో.. పద్మా దేవేందర్ రెడ్డి వర్గంలో అభద్రతా భావం మొదలైందట. తాజాగా జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో హావేలి ఘన్పూర్ ఎంపీపీగా శేరి నారాయణ రెడ్డిని సుభాష్ రెడ్డి ప్రతిపాదించారట. మానిక్ రెడ్డి అనే మరో నేతను పద్మా దేవేందర్ రెడ్డి తెరపైకి తెచ్చారట. అయితే పార్టీ అధిష్టానం నారాయణ్ రెడ్డి వైపే మొగ్గు చూపిందని తెలుస్తోంది. దీంతో పద్మా దేవేందర్ రెడ్డి వర్గం షాక్‌కి గురైనట్లు సమాచారం.

అటు మంత్రి పదవి లభిస్తుందని భావిస్తే.. అది రాలేదు. ఇటు చూస్తే ఎమ్మెల్యేగా కూడా తమ నేత మాట చెల్లుబాటు కాని పరిస్థితి నెలకొనడం ఆమె వర్గంలో ఆందోళన పెంచుతోంది. మరోవైపు ఎమ్మెల్సీ హోదాలో సుభాష్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారట. క్రమంగా సుభాష్ రెడ్డి పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అర్ధం అవుతున్నా.. ఏం చేయాలో అర్ధం కాని స్థితిలో పద్మా దేవేందర్ రెడ్డి అనుచరవర్గం ఉందట. ఈ ఎపిసోడ్ ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అన్న చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోందట.

Follow Us