కోడెల శివప్రసాదరావు కుమారుడికి లిక్కర్‌ డబ్బులు లేవా..? పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత

ఆంధ్రపద్రేశ్‌ శాసన సభ మాజీ స్పీకర్‌, స్వర్గీ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్‌పై సొంత పార్టీ నేత పోలీసులకు..

కోడెల శివప్రసాదరావు కుమారుడికి లిక్కర్‌ డబ్బులు లేవా..? పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత
Follow us

|

Updated on: Feb 08, 2021 | 1:14 PM

ఆంధ్రపద్రేశ్‌ శాసన సభ మాజీ స్పీకర్‌, స్వర్గీ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్‌పై సొంత పార్టీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద నుంచి రూ.1.30 కోట్ల విలువైన లిక్కర్‌ తీసుకుని డబ్బులివ్వడం లేదని గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీసులకు టీడీపీ నేత నర్రా రమేష్‌ ఫిర్యాదు చేశాడు.

రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన నర్రా రమేష్‌ టీడీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్‌ వ్యాపారం చేశారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో మద్యం పంపిణీ చేసేందుకు రూ.1.30 కోట్ల లిక్కర్‌ను తీసుకుని నగదు చెల్లించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లిక్కర్‌ డబ్బులు అడిగితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని నర్రా రమేష్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ హయాంలో 2015 నుంచి 2019 వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మద్యం వ్యాపారుల నుంచి అనధికారికంగా నగదు వసూలు చేశాడని ఆరోపించారు.

Read more:

సంగీతానికి చింతకాయలు రాలవు.. ఉద్యోగంలో ఉంటావా.. పోతావా..? అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం