సంగీతానికి చింతకాయలు రాలవు.. ఉద్యోగంలో ఉంటావా.. పోతావా..? అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

ఎప్పుడూ సౌమ్యంగా కనపడే ఆ ఎమ్మెల్యే ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. సంగీతానికి చింతకాయలు..

సంగీతానికి చింతకాయలు రాలవు.. ఉద్యోగంలో ఉంటావా.. పోతావా..? అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
Follow us
K Sammaiah

|

Updated on: Feb 08, 2021 | 12:38 PM

ఎప్పుడూ సౌమ్యంగా కనపడే ఆ ఎమ్మెల్యే ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. సంగీతానికి చింతకాయలు రాలవు.. ఉద్యోగంలో ఉండాలనుకుంటున్నవా.. పోవాలనుకుంటున్నవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈంతకీ ఆ ఎవరా ఎమ్మెల్యే..? ఆ కోపం వెనక కారణమేంటి..?

వికారాబాద్‌ జిల్లా “కొత్త కోల్కంద” పంచాయతీ సెక్రేటరీ నర్సింహులు నిర్లక్ష్యంగా సమాదానం ఇవ్వడంతో ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ ఆగ్రహించారు. “మీతో నేను“ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ నియోజకవర్గం “మోమిన్ పేట్ “మండలంలోని కొత్త కోల్కుంద గ్రామంలో వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే.. పనులు నత్తనడకన సాగడంపై అధికారులను వివరాలు అడిగారు. ఈ నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ నర్సింహులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే.. ఉద్యోగంలో ఉండాలనుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు పని చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more:

ఈ నెల 10న నెల్లికల్లు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి తప్పని వర్గపోరు. ఆ మంత్రి జిల్లాలో భగ్గుమన్న విభేదాలు