ఈ నెల 10న నెల్లికల్లు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ ఈనెల 10న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. తిరుమలగిరిసాగర్ మండలం నెల్లికల్లు గ్రామంలో..

ఈ నెల 10న నెల్లికల్లు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
Follow us
K Sammaiah

|

Updated on: Feb 06, 2021 | 6:23 PM

సీఎం కేసీఆర్‌ ఈనెల 10న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. తిరుమలగిరిసాగర్ మండలం నెల్లికల్లు గ్రామంలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు మంత్రి జగదీశ్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.

ప్రగతిభవన్‌లో శుక్రవారం సీఎం కేసీఆర్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలో సాగునీటి వ్యవస్థపై చర్చించారు. దేవరకొండ, నాగార్జునసాగర్‌, మునుగోడు, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల పరిధిలో నెల్లికల్లుతోపాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రూ.3 వేల కోట్లతో నెల్లికల్లుతోపాటు 8 నుంచి 9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్టు తెలిపారు.

ఇందులో భాగంగా ఈ నెల 10న మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో జరిగే టీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షించారు.

మంత్రి వెంట రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాజీ యం ఎల్ సి కర్నే ప్రభాకర్,ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల ఇంచార్జ్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు మరో ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,యస్.పి రంగనాధ్ తదితరులు పాల్గొన్నారు.

Read more:

తెలంగాణలో వ్యవసాయం దండగ కాదు.. పండగ.. సీఎం కేసీఆర్‌ కృషికి వారి సహకారం కావాలన్న మంత్రులు