పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి తప్పని వర్గపోరు. ఆ మంత్రి జిల్లాలో భగ్గుమన్న విభేదాలు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలో విభేదాలు పొడసూపుతున్నాయి. విజయనగరం జిల్లా వైసీపీలో విభేదాలు..

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి తప్పని వర్గపోరు. ఆ మంత్రి జిల్లాలో భగ్గుమన్న విభేదాలు
Follow us
K Sammaiah

|

Updated on: Feb 08, 2021 | 12:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలో విభేదాలు పొడసూపుతున్నాయి. విజయనగరం జిల్లా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై ఆయన సమీప బంధువు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

తన నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని, టీడీపీతో కలిసి డబ్బులు వెదజల్లి ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అన్నదమ్ములకి, వదినకి పదవులున్నా సంతృప్తి చెందక బొత్స లక్ష్మణరావు రాజకీయ ఉన్మాదిగా మారారని విమర్శించారు.

గత ఎన్నికల్లో తనకు వచ్చిన ముప్పైవేల మెజారిటీ చూసి ఓర్వలేక రాజకీయచిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రమంతా ఒకటైతే.. తన నియోజకవర్గంలో మరోలా ఉందన్నారు. బొత్స తన సోదరుడిని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారని, ఎన్నికల తరువాత అధిష్టానంకు పిర్యాదు చేస్తానని, అటో ఇటో తేల్చుకుంటానని అప్పలనాయుడు అన్నారు.

Read more:

ఈ నెల 10న నెల్లికల్లు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్‌రెడ్డి