ఆయన ఓ ‘ అబధ్ధాల కోరు’, ప్రధాని మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపాటు

ప్రధాని మోదీ ఓ అబధ్ధాల కోరని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రానికి  బీజేపీ గూండాలను తీసుకువస్తున్నదని ఆమె అన్నారు.

ఆయన ఓ ' అబధ్ధాల కోరు', ప్రధాని మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపాటు
Mamata Banerjee
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Mar 24, 2021 | 6:18 PM

ప్రధాని మోదీ ఓ అబధ్ధాల కోరని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రానికి  బీజేపీ గూండాలను తీసుకువస్తున్నదని ఆమె అన్నారు. బిష్ణుపూర్ లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె..ప్రధాన మంత్రి పదవిని తానెంతో గౌరవిస్తానని, కానీ ఈ ప్రధాని వంటి అబద్ధాలకోరును తాను చూడలేదని అన్నారు. ఆయన అబద్ధాలు మాత్రమే మాట్లాడుతారని, గూండాలంటే ఎవరని ప్రశ్నించిన ఆమె .. బీజేపీ పెడుతున్న టార్చర్ కారణంగా యూపీలోని ఐపీఎస్ అధికారులంతా  తమ ఉద్యోగాలు మానుకుంటున్నారని పేర్కొన్నారు.  బెంగాల్ సంస్కృతిని నాశనం చేసేందుకు బీజేపీ..యూపీ నుంచి గూండాలను తెస్తున్నదని ఆరోపించారు. ఏడాది కాలంగా రైతులు రోడ్డున పడ్డారని, వారిని కేంద్రం అలా చేసిందని అన్నారు. మోదీ, హోం మంత్రి  అమిత్ షా, పారిశ్రామికవేత్త ఆదానీలను ఆమె ముగ్గురు సభ్యుల సిండికేట్ గా అభివర్ణించారు.   దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరల పెంపును కూడా మమత ప్రస్తావించారు. ఇందుకు ఎవరు కారణమన్నారు. ప్రతి వారికీ 15 లక్షలు ఇస్తామని ప్రధాని హామీ ఇఛ్చారని, కానీ ఇచ్చ్చారా అని ప్రశ్నించారు. భేటీ పడావో, భేటీ బచావో అని నినాదం చేశారని, కానీ బాలికల విద్యకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.కానీ తమ ప్రభుత్వం బాలికల స్కాలర్ షిప్ కోసం 1500 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు ఇస్తోందన్నారు.

కాగా ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తున్న తరుణంలో బెంగాల్ లో ప్రధాన పార్టీలు తమ ప్రచార హోరును పెంచాయి. ముఖ్యంగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు వివిధ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.  ముఖ్యంగా అందరి దృష్టి  నందిగ్రామ్ పై ఉంది. ఇక్కడ టీఎంసి నుంచి   మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి పోటీ చేస్తున్నారు.  వీరు తమ తమ నామినేషన్ల విషయంలో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి: ఆస్ట్రేలియాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు, కారుకు కారే కొట్టుకుపోయింది

Tirupati By-Election: తిరుపతి ఉప ఎన్నిక.. అధికార, ప్రతిపక్షంలోని ఆ నాయకులకు అగ్ని పరీక్ష..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే