పట్టభద్రుల ఓటు అడిగే హక్కు కేవలం టీఆర్‌ఎస్‌కే ఉంది.. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శమని కేంద్రమే చెప్పింది -మంత్రి వేముల

పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కేవలం కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. రాష్ట్ర ఏర్పాటు నుంచి కేవలం ఆరు ఏండ్లలోనే

పట్టభద్రుల ఓటు అడిగే హక్కు కేవలం టీఆర్‌ఎస్‌కే ఉంది.. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శమని కేంద్రమే చెప్పింది -మంత్రి వేముల
Follow us
K Sammaiah

|

Updated on: Mar 04, 2021 | 5:17 PM

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం అచ్చంపేటలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కేవలం కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. రాష్ట్ర ఏర్పాటు నుంచి కేవలం ఆరు ఏండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా అవతరించిందని మంత్రి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పథకాలను కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలే ప్రశంసిస్తున్న విషయాన్ని వేముల గుర్తు చేశారు.

తెలంగాణ లో ఇంటింటికి నల్లాతో నీటిని ఇచ్చే మిషన్ భగీరథ పథకం లాంటిది దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చేపట్టాలని కేంద్రమే చెప్పింది. ఇట్లాంటి అంశాలు అన్ని పట్టబద్రులైన నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్, మేధావులు ఆలోచన చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎన్ని ఉద్యోగాలు ఎక్కువిచ్చారు.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఎంతిస్తున్నారు అని వారిని మీరు ప్రశ్నించాలని పట్టభద్రులనుద్దేశించి అన్నారు.

ప్రభుత్వానిది ఉద్యోగుల సంబంధం పేగుబంధం లాంటిది. టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా నిలవాలని అన్నారు. మీ సమస్యలపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు ముఖ్యమంత్రి కి ఉన్నది కాబట్టి వాటిని కచ్చితంగా పరిష్కరించుకుందమని అన్నారు. బీజేపీ,కాంగ్రెస్ భావోద్వేగ మాటలకు మోసపోవద్దని కోరారు.. వాళ్లు గెలిస్తే ఏం చేయగలరో కూడా ఆలోచించాలన్నారు వేముల. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది.టిఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ని గెలిపించి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి అడిగితే కాదనరని తెలిపారు.

అచ్చంపేటలో 8600 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. 6వేల పైచిలుకు ఓట్లు టిఆర్ఎస్ కు వస్తాయనే నమ్మకముందన్నారు. విద్యావంతురాలు, చిత్రలేఖ కళాకారిణి పూర్వ భారత ప్రధాని పి.వి నరసింహారావు కుమార్తె అయిన టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీ సమస్యలు పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తాను భరోసాగా ఉంటామని మంత్రి వేముల చెప్పారు.

Read more:

పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పక్కా ప్రణాళిక.. వాణిదేవిని గెలిపించడమే పీవీకి సరైన నివాళి-మంత్రి గంగుల

కేంద్రం ఇస్తానన్న ఏడాదికి కోటి ఉద్యోగాలు ఏవి..? బీజేపీ నేతలను నిలదీయాలని మంత్రుల పిలుపు