ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పక్కా ప్రణాళిక.. వాణిదేవిని గెలిపించడమే పీవీకి సరైన నివాళి-మంత్రి గంగుల

ఆర్థికంగా, సామాజికంగా దుర్భరంగా ఉన్న పరిస్థితుల్లో దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మన తెలంగాణా తేజం పీవీ నరసింహరావు అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పక్కా ప్రణాళిక.. వాణిదేవిని గెలిపించడమే పీవీకి సరైన నివాళి-మంత్రి గంగుల
Follow us

|

Updated on: Mar 04, 2021 | 5:45 PM

తెలంగాణలో గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ టీఆర్ఎస్ దూసుకుపోతుంది, హైదరాబాద్ ఎన్నికల ఇంజార్జి మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ప్రచారం ఉదృతంగా కొనసాగుతుంది. ఈ రోజు మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల, డివిజన్ స్థాయి ఇంచార్జులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి గంగుల పాల్గొన్నారు. ఓవైపు అబివృద్ది, సంక్షేమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అగ్రపథాన కొనసాగుతూ ట్రెండ్ సృష్టిస్తుంటే మరోవైపు దేశాన్ని అమ్మేస్తూ బీజేపీ దగా చేస్తుందని దుయ్యభట్టారు.

ఆర్థికంగా, సామాజికంగా దుర్భరంగా ఉన్న పరిస్థితుల్లో దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మన తెలంగాణా తేజం పీవీ నరసింహరావు అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి చేశారు. ఈనాడు మనం అనుభవిస్తున్న అభివృద్దిని సాదిస్తే… ఆయనను ఏ పార్టీ పట్టించుకోలేదని కనీస నివాళిని సైతం అర్పించని విషయాన్ని మనం చూశాం, కానీ ప్రతిభను గుర్తించడంలో ముందుండే మన సీఎం కేసీఆర్ నేడు పీవీ కుమార్తె, ఉన్నత విద్యావంతురాలు, మచ్చలేని వ్యక్తి సురభి వాణిదేవి గారిని ఎమ్మెల్సీగా పంపించడానికి సంసిద్దులైన విషయాన్ని విద్యావంతులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు గంగుల.

ఆరేళ్లలో అధ్బుత ప్రగతిని సాధించిన తెలంగాణ అవకాశాలను సృష్టించుకుంటూ ముందుకుసాగుతుంది. ప్రభుత్వ రంగంలో కేవలం ఆరేళ్లలోనే లక్షా ముప్పైవేలకు పైగా ఉద్యోగాలను ఇవ్వడంతో పాటు, ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాలను అందుభాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తుచేశారు, అమేజాన్, గూగుల్, ఐకియా లాంటి ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షిస్తూ ఎన్నో ఉద్యోగ అవకాశాల్ని మన తెలంగాణ యువతకు అందిస్తున్నదని తెలియజేశారు. సుస్థిరమైన పాలన, శాంతిభద్రతలు, కంపెనీలకు అనుమతులు ఇవ్వడంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ఇది సాద్యమైందని మంత్రి గంగుల అన్నారు.

ఒకనాడు కరెంటు, నీళ్లు, ఉద్యోగ, ఉపాది అవకాశాలు లేక మన బిడ్డలు వలసలు చేసేవారని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఈ ఆరేళ్లలో మన తెలంగాణలోకి తిరుగు వలసలు వస్తున్న వైనాన్ని వివరించారు. ఈ ఆరేళ్లలోనే అరవైఏళ్లలో తెలంగాణకు చేయలేని అభివృద్దిని మన టీఆర్ఎస్ ప్రభుత్వం సాదించిందన్నారు గంగుల. వీటన్నింటిని పట్టభద్రులు ఓటువేసే సమయంలో దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఒక ఇంట్లో నలుగురు కొడుకుల మద్య బేదాబిప్రాయాలు ఉన్నా… తండ్రిపై దాడి జరుగుతుంటే కొడుకులంతా ఏకమైతారని అదే విదంగా మన తెలంగాణపై దాడి చేసే బీజేపీని ఎదుర్కోవడానికి మనమంతా ఏకమవ్వాలని సూచించారు.

బీజేపీ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని నమ్మోద్దని, గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాట్లాడిన జూటా మాటల్ని గుర్తుంచుకోవాలని, ఈ ఆరేళ్లలో పట్టభద్రుల సమస్యలపై ఒక్కనాడు మండలిలో ప్రశ్నించని రాంచందర్ రావుని ఎదురు ప్రశ్నించాలని మంత్రి గంగుల కమలాకర్ పట్టభద్రులకు సూచించారు. వచ్చిన ఐటీఐఆర్ ను మన హైదరాబాద్ కు ఇవ్వకుండా తన్నుకుపోయిన గద్దలు బీజేపీ నేతలనే విషయం మరవద్దని ఓటర్లను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ విజయం సాదిస్తుందని దీమా వ్యక్తం చేశారు గంగుల, అందుకోసం మూడువేల నాలుగువందల మంది కార్యకర్తలతో డివిజన్ వారిగా ఇంచార్జిలను నియమించి ప్రతీ యాబై మంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఒక కమిటీని నియమించారు. నియోజకవర్గంలోని ఒక లక్షా యాబైమూడువేల పైచీలుకు ఓటర్లను కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించేలా కార్యాచరణ రూపొందించారు గంగుల.

మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల వస్తున్న పెట్టుబడుల గురించి తెలియజేశారు. నగరం ప్రశాంతంగా ఉండడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్దను కనభరుస్తున్న విషయాన్ని చెప్పారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెదటి ప్రాదాన్యతా ఓటు సురభివాణిదేవిగారికి వేసి గెలిపించాలని కోరారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతీ ఓటరుని కలుసుకొని టీఆర్ఎస్ అభివృద్ది గురించి తెలియజేయాలని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాదించేలా ప్రణాళికా భద్దంగా పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు

ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి, స్థానిక మంత్రులు మహమూద్ ఆలి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు, నగరంలోని కార్పోరేటర్లు, టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు.

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..
టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..
అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?
అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు