సాగర్‌ ట్రయాంగిల్‌ వార్, కాక పుట్టిస్తోన్న పింక్‌ ఆర్మీ, జానా గెలిచినా వేస్టట.! కుల సమీకరణాల లెక్కలో కమలం అభ్యర్థి.!

Sagar by election campaign : సాగర్‌లో ట్రయాంగిల్‌ వార్ రక్తికడుతోంది. ఎండదడకు వెరవకుండా ప్రధాన పార్టీల నేతలు ఊరూరా కలియ తిరుగుతున్నారు. తమకే ఓటేయాలంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఓటర్లను..

  • Venkata Narayana
  • Publish Date - 8:20 pm, Tue, 6 April 21
సాగర్‌ ట్రయాంగిల్‌ వార్, కాక పుట్టిస్తోన్న పింక్‌ ఆర్మీ, జానా గెలిచినా వేస్టట.! కుల సమీకరణాల లెక్కలో కమలం అభ్యర్థి.!
Nagarjuna Sagar By Election

Sagar by election campaign : సాగర్‌లో ట్రయాంగిల్‌ వార్ రక్తికడుతోంది. ఎండదడకు వెరవకుండా ప్రధాన పార్టీల నేతలు ఊరూరా కలియ తిరుగుతున్నారు. తమకే ఓటేయాలంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.ఓటర్లను ఆకర్షించే పనిలో పూర్తిస్థాయిలో నిమగ్నమైపోయారు ప్రధాన పార్టీల నేతలు. దీంతో సాగర్‌ నియోజకవర్గంలోని పల్లెలన్నీ ప్రచారంలో తడిసిముద్దవుతున్నాయి. డప్పు చప్పుళ్లు, మైక్ సౌండ్లతో మార్మోగిపోతున్నాయి. ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ఊళ్లకు ఊళ్లు చుట్టేస్తున్నాయి. కీలక నేతలు క్యాస్ట్ ఈక్వేషన్స్ లో మునిగిపోయారు. వారిని ఎట్రాక్ట్ చేసేందుకు హామీలు ఇస్తున్నాయి.

పింక్‌ ఆర్మీ ప్రచారంలో కాక పుట్టిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు ఎక్కడికక్కడ మకాం వేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కారు గుర్తుకే ఓటేయాలని విఙ్ఞప్తి చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకోని జానారెడ్డి.. ఇప్పుడు గెలిచి ఏం చేస్తాడని ప్రశ్నించారు మంత్రి తలసాని. అటు గుర్రంపాడులో ప్రచారం చేసిన నోముల భగత్‌.. సంక్షేమ పథకాలు చూసి కారుకి ఓటేయాలని విఙ్ఞప్తి చేశారు.

బీజేపీ అభ్యర్థి రవి నాయక్ ప్రచారాన్ని స్పీడప్ చేశారు. కుల సమీకరణాలను బేరీజు వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. లంబాడా తండాల్లో తిరుగుతూ వారి భాషలో మాట్లాడుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. చిన్న వయసులో తాను ఎమ్మెల్యేగా కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రవి నాయక్.

అటు కాంగ్రెస్‌ కూడా అధికార పార్టీకి ధీటుగా ప్రచారం చేస్తూ ఆరోపణాస్త్రాలు సంధిస్తోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో డబ్బు సంచులతో తిరుగుతున్నారని మండిపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. 2019 ఎంపీ ఎన్నికల్లో సొంత బిడ్డను గెలిపించుకోలేని కేసీఆర్‌.. సాగర్‌లో అభ్యర్థిని ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. మరోవైపు తండ్రి తరఫున ప్రచారంలో జోరు పెంచారు జానా తనయుడు రఘువీర్. టీఆర్‌ఎస్ బెదిరింపు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

అధికార పార్టీ అభివృద్ధి పేరుతో ప్రజల దగ్గరికి వెళ్తుంటే.. ప్రభుత్వ వైఫల్యాలే తమకు కలిసివస్తాయని బీజేపీ, కాంగ్రెస్‌లు ధీమాగా ఉన్నాయి. ఫైనల్‌గా మూడు పార్టీలు గెలుపు కోసం హోరాహోరీగా చెమటోడుస్తున్నాయి.

Read also : Chandrababu Campaign : ఇక టీడీపీ అధినేత వంతు, ఆ రోజు నుంచే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరుస బహిరంగ సభలు