AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Campaign : ఇక టీడీపీ అధినేత వంతు, ఆ రోజు నుంచే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరుస బహిరంగ సభలు

Chandrababu Tirupati by Election campaign schedule : తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచార షెడ్యూల్ ఖరారైంది.

Chandrababu Campaign : ఇక టీడీపీ అధినేత వంతు, ఆ రోజు నుంచే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరుస బహిరంగ సభలు
Venkata Narayana
|

Updated on: Apr 06, 2021 | 5:42 PM

Share

Chandrababu Tirupati by Election campaign schedule : తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఆయన ఈ నెల 8వ తేదీన సత్యవేడు నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెడతారు. 8 రోజుల పాటు ఉపఎన్నికల ప్రచారం చేయనున్న చంద్రబాబు.. తిరుపతి లోక్ సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. కాగా, ఇప్పటికే బీజేపీ-జనసేన ఉమ్మడిగా తిరుపతి ప్రచారంలో దూసుకువెళ్తుండగా, అటు, వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఇవాళ సైకిల్‌ తొక్కుతూ టీడీపీ కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఇలాఉంటే, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ  ఎన్నికల అఫిడవిట్ లో తన మొత్తం ఆస్తుల విలువ రూ 7.73 కోట్ల రూపాయలు అని చూపించిన సంగతి తెలిసిందే. బంగారం, స్థిరచరాస్తులు, ఇళ్లు, స్థలాలు అన్నీ కలిపి ఆమెకున్న ఆస్తుల విలువ 7 కోట్ల 74 లక్షల రూపాయలని అఫిడవిట్‌లో తెలిపారు పనబాక.

Read also : AV Ramana Deekshitulu : ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చిన టీటీడీ ప్రధానార్చకులు రమణదీక్షితులు