CM KCR: ‘కేసీఆర్‌ను ఒక్కసారి ప్రధానమంత్రిని చేయాలి’.. అసెంబ్లీలో మనసులో మాట బయటపెట్టిన మంత్రి

|

Mar 25, 2021 | 5:47 PM

"తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకసారి దేశానికి ప్రధాని కావాలి".. ఈ మాట అన్నది ఎవరో తెలుసా..? . మంత్రి మల్లారెడ్డి. అవును మినిస్టర్ సాబ్ అసెంబ్లీలో తన మనసులోని ఆకాంక్షను బయటపెట్టారు.

CM KCR: కేసీఆర్‌ను ఒక్కసారి ప్రధానమంత్రిని చేయాలి.. అసెంబ్లీలో మనసులో మాట బయటపెట్టిన మంత్రి
Telangana Cm Kcr
Follow us on

“తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకసారి దేశానికి ప్రధాని కావాలి”.. ఈ మాట అన్నది ఎవరో తెలుసా..? . మంత్రి మల్లారెడ్డి. అవును మినిస్టర్ సాబ్ అసెంబ్లీలో తన మనసులోని ఆకాంక్షను బయటపెట్టారు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ప్రజలకు సమస్యలే ఉండవని చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న వారు చిన్నప్పటి నుంచి అవే పథకాలు రన్ చేస్తున్నాయని.. ఏదో మభ్యపెట్టి కాలం గడుపుతున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు. 70 ఏళ్ల పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించిన మల్లారెడ్డి.. సీఎం కేసీఆర్ ఏడు సంవత్సరాలలోనే చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. రాష్రంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందించిన వ్యక్తి కేసీఆర్ అని ప్రశంసించారు. సాగునీరు, త్రాగునీరు, ఫించన్లు అర్హులైన అందరికీ అంజేసిన ఘటన తెలంగాణ ముఖ్యమంత్రిది అని తెలిపారు. దేశం చూపు తెలంగాణ వైపు ఉందని, అందుకే కేసీఆర్‌ను సీఎం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఒక్కసారి పీఎం అయితే.. అన్ని రాష్ట్రాల్లో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని ఆయన పేర్కొన్నారు.  చివర్లో తన స్పీచ్ ముగిస్తూ తన శాఖ పద్దు చాలా చిన్నదని.. సభ్యులందరూ సహకరించి పద్దును ఆమోదించాలని కోరడంతో మంత్రులు..హరీష్ రావు, కేటీఆర్ సహా సభ్యులంతా నవ్వులు చిందించారు.

Minister Malla Reddy

 

కాగా ఇప్పడే కాదు మంత్రి మల్లారెడ్డి సభలో ఎప్పుడు ప్రసంగించినా.. తన మార్క్ కామెంట్స్ చేస్తారు. గతంలో కూడా ఆయన పలుసార్లు చేసిన కామెంట్స్ వైరలయ్యాయి. ఆయన మాట్లాడే విధానం.. యాస విభిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.

Also Read:  సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం.. ఏప్రిల్ 6న నిధుల విడుదల

ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన మెగాస్టార్ చిరంజీవి.. పూర్తి వివరాలు