మాయావతిపై మేనకాగాంధీ తీవ్ర ఆరోపణలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుల్తాన్‌పూర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి మేనకా గాంధీ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనకా గాంధీ బుధవారం సుల్తాన్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ‘మాయావతి తన పార్టీలోని ఒక్కోటికెట్‌ను రూ. 15-20 కోట్లకు అమ్ముకుందన్నారు. అంతేకాకుండా ఆ మొత్తాన్ని డైమండ్‌లు లేదా నగదు రూపంలో స్వీకరించారని’ ఆరోపించారు. టికెట్ కొనుక్కోవడానికి బీఎస్పీ అభ్యర్థుల దగ్గర […]

మాయావతిపై మేనకాగాంధీ తీవ్ర ఆరోపణలు
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2019 | 5:46 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుల్తాన్‌పూర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి మేనకా గాంధీ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనకా గాంధీ బుధవారం సుల్తాన్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ‘మాయావతి తన పార్టీలోని ఒక్కోటికెట్‌ను రూ. 15-20 కోట్లకు అమ్ముకుందన్నారు. అంతేకాకుండా ఆ మొత్తాన్ని డైమండ్‌లు లేదా నగదు రూపంలో స్వీకరించారని’ ఆరోపించారు. టికెట్ కొనుక్కోవడానికి బీఎస్పీ అభ్యర్థుల దగ్గర అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించిన ఆమె.. అదంతా సామాన్య ప్రజల సొమ్మే అని దుయ్యబట్టారు. మాయావతి పేరుపై దాదాపు 77 ఇళ్లు ఉన్నాయని మేనకాగాంధీ ఆరోపించారు.