ఎన్నికల సెలవులపై ఏపీ ప్రభుత్వం ప్రకటన
ఎన్నికల సెలవులపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11న సెలవుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పోలింగ్‌కు ముందు రోజు(ఏప్రిల్10)తో పాటు ఓట్ల లెక్కింపు జరిగే మే 23న స్థానిక సెలవులుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల […]

ఎన్నికల సెలవులపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11న సెలవుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పోలింగ్‌కు ముందు రోజు(ఏప్రిల్10)తో పాటు ఓట్ల లెక్కింపు జరిగే మే 23న స్థానిక సెలవులుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ వేగవంతం చేసింది.



