సర్వే ఫలితాలు ఆ రోజున వెల్లడిస్తా: లగడపాటి
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలను మే 19న వెల్లడిస్తానని మాజీ ఎంపీ లగడపాటి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన లగడపాటి ఏపీ ఎన్నికలపై మాట్లాడారు. అనుభవఙ్ఞులకే ప్రజలు పట్టం కడతారని లగడపాటి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్ రీత్యా అనుభవఙ్ఞులైన నాయకుల అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటేసేముందు అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ ప్రజలు చూస్తారని లగడపాటి చెప్పారు. కాగా లగడపాటి సర్వే ఫలితాలపై అంతటా అంచనాలు బలంగా ఉండేవి. ఆయన […]

తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలను మే 19న వెల్లడిస్తానని మాజీ ఎంపీ లగడపాటి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన లగడపాటి ఏపీ ఎన్నికలపై మాట్లాడారు. అనుభవఙ్ఞులకే ప్రజలు పట్టం కడతారని లగడపాటి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
రాష్ట్ర భవిష్యత్ రీత్యా అనుభవఙ్ఞులైన నాయకుల అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటేసేముందు అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ ప్రజలు చూస్తారని లగడపాటి చెప్పారు. కాగా లగడపాటి సర్వే ఫలితాలపై అంతటా అంచనాలు బలంగా ఉండేవి. ఆయన సర్వే ఫలితాలు కచ్చితంగా నిజమవుతాయని నమ్మేవారు. కానీ గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకుగానూ లగడపాటి ఇచ్చిన సర్వే ఫలితాలు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.