జగన్‌కే ‘జై’ కొడుతోన్న జేసీ..ఆహ్వానిస్తుందా వైసీపీ?

జేసీ దివాకర్ రెడ్డి.. ఈ పేరుకి ఒక హిస్టరీ ఉంది. తెలుగు స్టేట్స్‌లో ఈయనో ఫైర్ బ్రాండ్. సొంత పార్టీయైనా, పరాయి పార్టీయైనా..మంచి చేస్తే కాంప్లిమెంట్స్..దారి తప్పితే వార్నింగ్స్ ఇవ్వడం ఈ సీనియర్ నేతకు అలవాటు. కరుడుగట్టిన కాంగ్రెస్ నేతగా పేరు తెచ్చుకున్న జేసీ అసలు టీడీపీ కండువా కప్పుకుంటారని ఎవ్వరూ ఊహించిఉండరు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ గల్లంతవ్వడం, వైసీపీలో చేరదామంటే తమ స్నేహితుడి కుమారుడైన వైఎస్ జగన్‌ ముందు తగ్గి ఉండాల్సి రావడంతో జేసీ అనివార్య […]

జగన్‌కే 'జై' కొడుతోన్న జేసీ..ఆహ్వానిస్తుందా వైసీపీ?
JC Diwakar Reddy latest Comments
Follow us

|

Updated on: Sep 07, 2019 | 5:59 PM

జేసీ దివాకర్ రెడ్డి.. ఈ పేరుకి ఒక హిస్టరీ ఉంది. తెలుగు స్టేట్స్‌లో ఈయనో ఫైర్ బ్రాండ్. సొంత పార్టీయైనా, పరాయి పార్టీయైనా..మంచి చేస్తే కాంప్లిమెంట్స్..దారి తప్పితే వార్నింగ్స్ ఇవ్వడం ఈ సీనియర్ నేతకు అలవాటు. కరుడుగట్టిన కాంగ్రెస్ నేతగా పేరు తెచ్చుకున్న జేసీ అసలు టీడీపీ కండువా కప్పుకుంటారని ఎవ్వరూ ఊహించిఉండరు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ గల్లంతవ్వడం, వైసీపీలో చేరదామంటే తమ స్నేహితుడి కుమారుడైన వైఎస్ జగన్‌ ముందు తగ్గి ఉండాల్సి రావడంతో జేసీ అనివార్య పరిస్థితుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన ఎంపీగా, ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా సీమ రాజకీయాలను శాసించారు. కాగా జేసీ దివాకర్ రెడ్డి ఎంతగానో ఆశపడ్డ కేంద్రమంత్రి పదవి మాత్రం ఆయనను వరించలేదు. తాజా ఎన్నికల్లో తమ కుమారులను రాజకీయ వారసులుగా బరిలోకి దించారు. జగన్ వేవ్ ముందు టీడీపీ తునాతునకలు కావడంతో వారు ఓటమి చెందక తప్పలేదు.

ఓటమి తర్వాత జేసీలో మార్పు కనిపిస్తోంది. అంతకుముందు వరకు జగన్‌ను తిట్టిపోసిన ఈ సీనియర్ నేత..తాజాగా జగన్ మా వాడే..మా వాడు అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు…మా వాడి 100 రోజుల పాలనకు 110 మార్కులు ఇస్తానంటూ రివర్స్ యాంగిల్‌లో వస్తున్నారు. అసలు ఎన్నికల అనంతరం ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం కన్ఫార్మ్ అంటూ రూమర్స్ వినిపించాయి. మరి చివరి నిమిషంలో ఆయన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

ఇదిలా ఉండగా ఆయన రీసెంట్‌గా క్రేజీ కామెంట్స్ చేశారు. మేం పార్టీలోకి వస్తామంటే మమ్మల్ని రానిస్తారా? అన్న మాట జేసీ నోటి నుంచి వచ్చిందంటే.. పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల విషయంలో జగన్ చాలా కచ్ఛితంగా ఉన్నట్లుగా చెబుతారు. అయితే ఆయన దూకుడుతనం వల్లే జగన్ కాస్త దూరం పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి బలం చేకూరేలా జేసీ మాటలు ఉన్నాయని చెప్పాలి. జగన్‌ను చేయి పట్టి నడిపించే వారి అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేయటం గమనార్హం. జగన్ కు ప్రతి  అంశాన్ని మైక్రోస్కోప్ లో చూసి లోపాలు సరిదిద్దాలన్నారు. అంతేకానీ మైక్రోస్కోప్ ను నేలకేసి కొట్టొద్దన్న మాట ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జగన్ ను ఉద్దేశించి జేసీ మాట్లాడుతూ.. మా వాడు చాలా తెలివైనవాడు అంటూ కితాబులు ఇచ్చారు. అయితే జగన్ ప్రభుత్వం పట్ల పాజిటీవ్ కామెంట్స్ ఇస్తూ ఆయన ఏం సంకేతాలిస్తానరే విషయం మాత్రం అర్దం కావట్లేదు. జేసీ డైరెక్ట్‌‌గా వైసీపీలో చేరకుండా..తనను ఆహ్వానించమని పరోక్షంగా చెప్తున్నారా? లేక జగన్ పాలన నచ్చే అలాంటి కామెంట్స్ చేశారా అనేది తెలియాల్సి ఉంది.