మురళీమోహన్ మౌనానికి కారణం అదేనా..?

మురళీమోహన్ మౌనానికి కారణం అదేనా..?

ఏపీ రాజకీయాల్లో ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్‌కి ప్రత్యేక స్థానం.. గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల్లో రాజమండ్రి స్థానం నుంచి గెలిచిన మురళీ మోహన్ ఎంపీగా.. కేంద్రంలో కీలకంగా వ్యవహరించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో.. మురళీ మోహన్ గట్టిగానే తన స్వరం వినిపించారు. అలాగే.. చంద్రబాబుకి కూడా.. ఆర్థికంగా.. రాజకీయంగా.. అండదండలు అందించే వ్యక్తి కూడా. కానీ.. ఒక్కసారిగా.. ఆయన మౌనం అవకాడనికి కారణమేంటని.. తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మురళీ మోహన్‌కి […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Sep 07, 2019 | 6:42 PM

ఏపీ రాజకీయాల్లో ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్‌కి ప్రత్యేక స్థానం.. గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల్లో రాజమండ్రి స్థానం నుంచి గెలిచిన మురళీ మోహన్ ఎంపీగా.. కేంద్రంలో కీలకంగా వ్యవహరించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో.. మురళీ మోహన్ గట్టిగానే తన స్వరం వినిపించారు. అలాగే.. చంద్రబాబుకి కూడా.. ఆర్థికంగా.. రాజకీయంగా.. అండదండలు అందించే వ్యక్తి కూడా. కానీ.. ఒక్కసారిగా.. ఆయన మౌనం అవకాడనికి కారణమేంటని.. తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మురళీ మోహన్‌కి కొన్ని రోజుల నుండీ ఆరోగ్యం బాగోక.. ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం బాగోలేకనే.. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా.. కోడలి చేత పోటీ చేయించారని సమాచారం. అనంతరం.. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘనమైన మెజార్టీతో.. గెలిచింది. ఆ తర్వాత నుంచీ.. టీడీపీ నేతలపై.. అధికారం పక్షం నేతలు.. వీరిపై.. వారు పలు ఆరోపణలు.. విమర్శలు చేసుకుంటున్నారో.. చూస్తునే ఉన్నాం కదా..! అలాగే.. ఏపీ రాజధాని కోసం కూడా.. పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. ఈ సమయంలో కూడా.. మురళీ మోహన్ పెదవి విప్పలేదు.

కాగా.. 2019 ఎన్నికల్లో మురళీ మోహన్ కోడలు రూప.. ఓడిపోయిన తర్వాత నుంచీ.. ఆయన గానీ.. కుటుంబం నుంచీ గానీ.. ఇప్పటివరకూ రాజమండ్రిలో.. ఎవరూ.. అడుగు పెట్టలేదట. ఓడిపోయామని.. కారణంగానే మురళీ మోహన్.. ఆయన కుటుంబసభ్యులు మొహం చాటేసారని.. జోరుగా వార్తలు కూడా వినిపిస్తోన్నాయి.

మరో కీలక విషయం ఏంటంటే.. రియల్ ఎస్టేట్ సంస్థ జయభేరి కంపెనీ విషయంలో కూడా.. మురళీ మోహన్ పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ.. కొన్ని రోజుల క్రితం మీడియాలో.. వార్తలు ప్రచురితం అయ్యాయి. ఈ రకంగానే.. మురళీ మోహన్ ఆరోగ్యం క్షీణించిందని.. వార్తలు ప్రచురితం అయ్యాయి. అయితే.. ఆయన మాత్రం.. ఏ విధమైన వార్తలపై ఇంతవరకూ స్పందించలేదు. ఇప్పుడు మళ్లీ.. ఆయన నోరు విప్పితే.. ఎక్కడ కేసులు తన మెడకు చుట్టుకుంటాయోనని.. ఆయన సైలెంట్‌గా ఉన్నారని సమాచారం. ఏదిఏమైనా.. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించే విషయంలో.. మాత్రం ఆయన గట్టిగానే ప్రయత్నం చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu