AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2024 రేస్..తెలుగు స్టేట్స్‌లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?

తెలుగు రాష్ట్రాల్లో  బలపడాలనే ఆలోచనతోనే బీజేపీ ఇప్పటికే రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది.  సామ, దాన, భేద, దండోపాయాలలో ఏదో ఒకదాన్ని వాడటం..రాష్ట్రంలో పాగా వేయడం బీజేపీకి దినచర్యగా మరింది. భారీ విజయంతో మోదీ – షా ద్వయం  కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. ప్రతి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, దేశ వ్యాప్తంగా కాషాయ జెండా ఎగరవేయాలని పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే అటువంటి సందర్భం ఉత్పన్నమైనా ఆశ్యర్యపడాల్సిన పనిలేదు. మోదీ […]

2024 రేస్..తెలుగు స్టేట్స్‌లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
Ram Naramaneni
| Edited By: |

Updated on: Sep 07, 2019 | 6:43 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో  బలపడాలనే ఆలోచనతోనే బీజేపీ ఇప్పటికే రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది.  సామ, దాన, భేద, దండోపాయాలలో ఏదో ఒకదాన్ని వాడటం..రాష్ట్రంలో పాగా వేయడం బీజేపీకి దినచర్యగా మరింది. భారీ విజయంతో మోదీ – షా ద్వయం  కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. ప్రతి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, దేశ వ్యాప్తంగా కాషాయ జెండా ఎగరవేయాలని పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే అటువంటి సందర్భం ఉత్పన్నమైనా ఆశ్యర్యపడాల్సిన పనిలేదు. మోదీ లాంటి చరిష్మా ఉన్న నాయకుడు, షా లాంటి వ్యూహకర్తలు ఉన్నంతకాలం ఆ పార్టీకి ఢోకా లేదు అన్నది రాజకీయ పండితులు అభిప్రాయం. దృఢంగా పోరాడాల్సిన కాంగ్రెస్ నాయకత్వ లేమితో వెలవెలబోతోంది. ఆ పార్టీకి కొత్త రక్తం అవసరం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే..మరో 20, 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ కోలుకోవడం కష్టమే. ప్రత్యామ్నాయ పార్టీలుగా వైసీసీ, జనసేత సత్తా చాటుతుండటంతో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూసే నాయకుడు, కార్యకర్తలు కరువైపోయారు. ఇక తెలంగాణలో అధికారం చేపట్టడానికి అవకాశమున్నా నాయకులు కుమ్ములాటలతో స్వయం తప్పిదాలు చేస్తున్నారు.

మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలం, బలగం పెంచటానికి డిఫరెంట్ స్ట్రాటజీని ప్లే చేస్తుంది. కుల ప్రాబల్యం అధికంగా ఉండే రాష్ట్రం  కావడంతో ఆ దిశగానే ప్రయత్నాలు ముమ్మురం చేస్తుంది. ముఖ్యంగా జనాభా పరంగా అధికంగా ఉండి అధికారానికి దూరంగా ఉంటూ వస్తున్న కాపు సామాజికవర్గాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అదే సామాజికివర్గానికి చెందిన నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడిగా ఉండగా..మరో కాపు నాయకుడు సోము వీర్రాజు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక జనసేన పార్టీని సైతం తమలో కలుపుకోవాలని ఉవ్విళ్లూరినా అందుకు జనసేనాని సమ్మతించలేదు. ఆ విషయం ఆయనే బహిరంగంగా చెప్పిన విషయం వాస్తవం. ఇక ఎన్నికల ముందు వరకు వైసీపీతో చెలిమి ప్రదర్శించిన బీజేపీ..జగన్ అధికారంలోకి వచ్చి నెలరోజులు తిరక్కముందే విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ఇందుకు పై నుంచి వచ్చిన ఆదేశాలే కారణమనేది జగమెరిగిన సత్యం. తమకంటూ ఒక సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే కేసులు భయంతో కొంతమంది, జగన్ పార్టీలోకి వెళ్లలేక మరికొందరు ఆ పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తమ మార్క్ చూపించేలా..ఏపీలో అధికారంలో భాగమయ్యేలా వారి ప్రవర్తన ఉందన్న మాటలో ఎటువంటి సందేహం లేదు.

ఇక ఇటు తెలంగాణలోనూ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్న బీజేపీ..ప్రస్తుతానికి తామే ప్రధాన ప్రతిపక్షంగా మారి..వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతుంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలు నాయకుల్లో, క్యాడర్‌లో పూర్తి జోష్ నింపాయి. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కవితనే ఓడించడంతో ఆ పార్టీ విజయగర్వంతో ఉప్పొంగుతోంది. అయితే పైపై మెరుపులు కాకుండా పార్టీని క్రియాశీలకంగా బలపరచడం బీజేపీ ముందున్న ప్రధాన లక్ష్యం. ఇప్పటికే నాయకులు భారీగా పార్టీలో చేరుతున్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌కు గవర్నర్‌గా దత్తాత్రేయకు పదవి ఇవ్వడంతో బీజేపీ తెలంగాణకు ప్రాధాన్యతను ఇస్తుందన్న సంకేతాలను జనంలోకి పంపింది. ఇక గవర్నర్‌గా పార్టీకి విధేయురాలైన సౌందర రాజన్‌ను పంపి కేసీఆర్‌కు వార్నింగ్ పంపింది. ఏది..ఏమైనా దేశంలో బీజేపికి ఇప్పుడున్న అంగబలం, అర్థబలం ఆ పార్టీని అస్సలు ఒక్క సీటు కూడా సాధించలేని రాష్ట్రంలో కూడా అతితక్కువకాలంలో  అధికారంలోకి తెచ్చే విధంగా ఉన్నాయి. మరి 2024 ఎన్నికల్లో ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఎలా సత్తా చాటుతుందో  వేచి చూడాలి.