వివేకా హత్యపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన జగన్
హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో గవర్నర్ నరసింహన్‌తో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. హత్య వెనక కుట్ర ఉందని గవర్నర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరినట్టు జగన్ తెలిపారు. ఫిర్యాదు చేసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌పై ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ టీడీపీ వాచ్‌మెన్‌లా పని చేస్తోందని అన్నారు. కుట్ర వెనక ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉంది. ఎస్పీ, […]
హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో గవర్నర్ నరసింహన్‌తో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. హత్య వెనక కుట్ర ఉందని గవర్నర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరినట్టు జగన్ తెలిపారు. ఫిర్యాదు చేసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌పై ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ టీడీపీ వాచ్‌మెన్‌లా పని చేస్తోందని అన్నారు.
కుట్ర వెనక ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉంది. ఎస్పీ, డీఐజీతో మేం మాట్లాడుతుండగానే ఏబీ వెంకటేశ్వరరావు ఫోన్లు చేసి చాలాసేపు మాట్లాడారని జగన్ అన్నారు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని జగన్ డిమాండ్ చేశారు. టీడీపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్పించడంలో ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందని జగన్ ఆరోపించారు.