ప్రేమికుల రోజు, గులాబీలకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
Samatha
2 February 2026
వాలెంటైన్స్ డే అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది గులాబీ పూలు. ఈ రోజున ప్రేమికులు తమ ప్రేమను గులాబీలు ఇచ్చి వ్యక్త పరుస్తుంటారు.
వాలెంటైన్స్ డే
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అసలు గులాబీలకు, వాలంటైన్స్ డేకు ఉన్న ప్రాముఖ్యత ఏంటీ. ప్రేమికుల రోజున గులాబీలు ఎందుకు ఇస్తారో? కాగా , ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం.
రోస్, లవర్స్ డే
గులాబీలు స్వచ్ఛత, అమాయకత్వం, అందాన్ని సూచిస్తాయి. అందువలన వీటిని ఇవ్వడం అనేది ప్రేమను చూపెట్టడం, సానుభూతి వ్యక్త పరచడం.
గులాబీలు స్వచ్ఛత
ఇక ప్రేమికుల రోజున గులాబీలు ఇవ్వడం అనే సంప్రదాయం పురాతన కాలం నుంచే ఉన్నదంట. ఎందుకంటే ఇవి చాలా అందమైనవే కాకుండా ప్రతి ఒక్క రికీ నచ్చే పూలు.
ప్రేమికుల రోజు
అందువలన తమ ప్రేమను అందమైన గులాబీతో తెలపడం వలన అది భాగస్వామి మనసును గెలుచుకునేందుకు దోహద పడుతుందంట.
గులాబీలు ప్రేమకు గుర్తు
అంతే కాకుండా గులాబీ పూలు అనేక రకాలుగా ఉంటాయి. ఒక్కో రంగు ఒక్కో ప్రాముఖ్యతను తెలియబరుస్తుంది. ఇవి భావోద్వేగాలను తెలపడానికి ఉపయోగపడతాయి.
గులాబీలు అనేక రంగులు
ముఖ్యంగా ఎరుపు రంగు అనేది ప్రేమకు చిహ్నం. మీ లోతైన ప్రేమను తెలియ చేయడానికి లేదా మీ ప్రేమ గొప్పది అని తెలియజేయడానికి ఎర్రని గులాబీలను ఇస్తుంటారు.
ఎరుపు రంగు
అందుకే ప్రేమికుల రోజు చాలా మంది తమ ప్రేమను తెలపడానికి గులాబీలను తమ ప్రేమను తెలపడానికి ఉపయోగిస్తారంట.