సొంత గూటికి రాములమ్మ.. ! ముహూర్తం కూడా ఫిక్స్ అట..!

గతకొద్ది రోజులుగా రాములమ్మ పార్టీ మారడంపై వస్తున్న వార్తలపై త్వరలో ఎండ్ కార్డ్ పడనున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాములమ్మ.. గత ఎన్నికల్లో పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. అయితే గతేడాది రాష్ట్రాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల జరిగిన సార్వ్రతిక ఎన్నికల్లో కూడా దేశ వ్యాప్తంగా మరోసారి కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా […]

సొంత గూటికి రాములమ్మ.. ! ముహూర్తం కూడా ఫిక్స్ అట..!
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 1:01 PM

గతకొద్ది రోజులుగా రాములమ్మ పార్టీ మారడంపై వస్తున్న వార్తలపై త్వరలో ఎండ్ కార్డ్ పడనున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాములమ్మ.. గత ఎన్నికల్లో పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. అయితే గతేడాది రాష్ట్రాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల జరిగిన సార్వ్రతిక ఎన్నికల్లో కూడా దేశ వ్యాప్తంగా మరోసారి కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

బీజేపీతో పొలిటికల్ ఎంట్రీ..

అయితే ఆమె రాజకీయ ప్రస్థానం బీజేపీతో ప్రారంభమైనా.. ఆ తర్వాత పరిస్థితుల ప్రభావంతో ఆమె బీజేపీకి గుడ్‌బై చెప్పి.. తెలంగాణ సాధన కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి.. 2009లో టీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేశారు. తెలంగాణ రాష్ట్రా విభజన సమయంలో పార్లమెంట్‌లో కీలకంగా వ్యవహరించారు.

టీఆర్ఎస్‌ నుంచి హస్తం వైపు..

అయితే టీఆర్ఎస్‌లో సముచిత స్థానం కల్పించడం లేదంటూ.. టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌ బై చెప్పి.. హస్తం పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ ఓడిపోవడంతో.. సీన్ రివర్స్ అయ్యింది. మళ్లీ కొద్ది రోజులు సైలంట్‌గా ఉన్నా.. మళ్లీ గత అసెంబ్లీ ఎన్నికల్లో రాములమ్మ మళ్లీ ఆక్టివ్ అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపైనర్‌గా ఉన్నా.. జాతీయ స్థాయిలో ఆమెకు కావాల్సినంత గుర్తింపు వచ్చినా.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఆమెకు మింగుడుపడటం లేదు.

కాంగ్రెస్ నేతల తీరుపై అసహనం.. కమలనాథులతో చిట్‌చాట్..!

రెండో సారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడంతో.. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా మారిపోయింది. దానికి తోడుగా.. ఉన్న ఎమ్మెల్యేలో కూడా వర్గ పోరు ఉండటంతో రాములమ్మ తన రూట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ఫైట్ చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఫేస్‌బుక్ వేధికగా తరచూ పోస్టులు పెడుతూ.. వార్తల్లో నిలుస్తున్నారు. అయితే అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టి పోరాడాలంటే.. అది కాంగ్రెస్‌తో కాకుండా బీజేపీతోనే సాధ్యమని భావిస్తున్నారు విజయశాంతి. అయితే తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా.. అధికారం చేపట్టాలన్న ధీమాతో ఉన్న కమలనాథులు.. ఇప్పటికే పలు పార్టీల నేతలతో టచ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతితో కూడా బీజేపీ నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాములమ్మ తిరిగి బీజేపీలోకి వస్తే.. పార్టీ మరింత బలపడుతుందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది. దీంతో విజయశాంతితో బీజేపీ అగ్రనేతలు రాములమ్మతో భేటీ అయ్యి.. పార్టీలో చేరికపై చర్చించారని సమాచారం.

రీ ఎంట్రీకి ముహూర్తం.. !

అయితే కమలనాథులతో జరిగిన సమావేశంలో బీజేపీలోకి రీ ఎంట్రీకి రాములమ్మ సై అన్నట్లు ఆమె సహచరులు చెబుతున్నారు. రాబోయే దసరా పండుగ రోజు.. హస్తానికి గుడ్ బై చెప్పి.. కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రాములమ్మ రీ ఎంట్రీ ఇస్తే.. ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం కూడా చేపడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై రాములమ్మ విరుచుకుపడడం చూడాల్సిందే. మరో రెండు మూడు రోజుల్లో హస్తానికి రాజీనామా కూడా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రాములమ్మ ఇంకా స్పందించలేదు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో