AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్ ఫ్యూజన్‌లో రాజగోపాల్ రెడ్డి..!

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్రాస్ రోడ్ లో ఉన్నారా..ఏ దారికి వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా..అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని పొగుడుతూ కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. అయితే పార్టీ మారుతారని అంతా ఊహించినా అలాంటిదేమి జరగలేదు. బీజేపీలోకి వెళ్తానంటూ స్టేట్ మెంట్లు మాత్రం ఇచ్చాడు. ఇతని తర్వాత స్టేట్ మెంట్లు ఇచ్చిన నేతలంతా ఇప్పటికే కమలం గూటికి చేరిపోయారు. మరీ రాజగోపాల్ […]

కన్ ఫ్యూజన్‌లో రాజగోపాల్ రెడ్డి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 11, 2019 | 8:34 PM

Share

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్రాస్ రోడ్ లో ఉన్నారా..ఏ దారికి వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా..అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని పొగుడుతూ కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. అయితే పార్టీ మారుతారని అంతా ఊహించినా అలాంటిదేమి జరగలేదు. బీజేపీలోకి వెళ్తానంటూ స్టేట్ మెంట్లు మాత్రం ఇచ్చాడు. ఇతని తర్వాత స్టేట్ మెంట్లు ఇచ్చిన నేతలంతా ఇప్పటికే కమలం గూటికి చేరిపోయారు. మరీ రాజగోపాల్ రెడ్డి దారెటో అర్థం కాక ఆయన క్యాడర్ అంతా అయోమయం చెందుతున్నారట.

ఇక కాంగ్రెస్ పనైపోయింది..బీజేపీనే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమంటూ కామెంట్స్ చేసిన రాజగోపాల్ రెడ్డి..ఇప్పుడు అటు బీజేపీలో చేరకుండా..ఇటు కాంగ్రెస్ తో కలిసుండకుండా ఒంటరిపోరాటం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా బీజేపీలో చేరితే తన పదవికి ఇబ్బంది తప్పదని భావిస్తున్న కోమటిరెడ్డి ఇంకా వెయిట్ అండ్ సీ ధోరణిలోనే ఉన్నారట. మరికొందరు ఎమ్మెల్యేలు కలిసివస్తే విలీనం చేస్తే బాగుంటుందనేది రాజగోపాల్ ప్లానటా. అందుకే అలాంటి టైం ఏదైనా వస్తుందా అని వేచి చూస్తున్నారట కోమటిరెడ్డి.

2024లో బీజేపీదే అధికారమంటూ పదే పదే కామెంట్స్ చేస్తున్న కోమటిరెడ్డి ఎందుకు ఇప్పటి వరకు బీజేపీలో చేరలేదు. ఎవరి కోసమైనా వెయిటింగ్ చేస్తున్నారా..అనేది ఇప్పడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.

పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..
పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..
జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే
జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే
టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ ప్లేయర్
టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ ప్లేయర్
విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
మౌని అమావాస్యనాడు పూర్వీకులు కలలోకి వస్తే.. శుభమా? అశుభమా?
మౌని అమావాస్యనాడు పూర్వీకులు కలలోకి వస్తే.. శుభమా? అశుభమా?
120 వీధికుక్కలను పాతిపెట్టిన ఘటన.. 9 మందిపై కేసులు
120 వీధికుక్కలను పాతిపెట్టిన ఘటన.. 9 మందిపై కేసులు
మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు నయనతార ఎంత తీసుకుంటుందంటే..
మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు నయనతార ఎంత తీసుకుంటుందంటే..
సంక్రాంతి కోడిపందాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సంక్రాంతి కోడిపందాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
చైనా మాంజా తగిలి సాప్ట్‌వేర్ ఇంజనీర్ మెడకు గాయాలు
చైనా మాంజా తగిలి సాప్ట్‌వేర్ ఇంజనీర్ మెడకు గాయాలు
తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరుస్తున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరుస్తున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు