నా తప్పు ఉందంటే ఉరి తీయండి: ఆది నారాయణ రెడ్డి
కడప: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనక చంద్రబాబు, లోకేశ్, ఆది నారాయణ రెడ్డిల హస్తం ఉందని వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీనిపై ఆది నారాయణ రెడ్డి స్పందిస్తూ నేను గానీ, నా వాళ్లు గానీ ఈ హత్య వెనక ఉన్నామని తేలితే తనను బహిరంగంగా ఉరి తీయండి అంటూ ఆది నారాయణ రెడ్డి చెప్పారు. ఏం జరిగిందనేది ఆ భగవంతుడికే తెలియాలని, దర్యాప్తు ద్వారానే అంతా తెలుస్తుందని, నిజానిజాలు బయటపడతాయని అన్నారు. టీడీపీ మీద […]

కడప: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనక చంద్రబాబు, లోకేశ్, ఆది నారాయణ రెడ్డిల హస్తం ఉందని వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీనిపై ఆది నారాయణ రెడ్డి స్పందిస్తూ నేను గానీ, నా వాళ్లు గానీ ఈ హత్య వెనక ఉన్నామని తేలితే తనను బహిరంగంగా ఉరి తీయండి అంటూ ఆది నారాయణ రెడ్డి చెప్పారు.
ఏం జరిగిందనేది ఆ భగవంతుడికే తెలియాలని, దర్యాప్తు ద్వారానే అంతా తెలుస్తుందని, నిజానిజాలు బయటపడతాయని అన్నారు. టీడీపీ మీద వైసీపీ విపరీతంగా తప్పులు మోపుతుందని, పదే పదే ఆరోపణలు చేస్తుందని ఆది నారాయణ రెడ్డి మండిపడ్డారు.



