Jabardasth Dhanraj: తల్లి చనిపోతే చిల్లిగవ్వలేదు.. బంగారమిచ్చి మరీ జజబర్దస్త్ ధనరాజ్‌కు సాయం చేసింది ఎవరంటే?
కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు ధన్ రాజ్. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. జబర్దస్త్ లోనూ అడుగు పెట్టి టీమ్ లీడర్ కూడా అయ్యాడు. ఆ మధ్యన రామం రాఘవం సినిమాతో హీరోగానూ, డైరెక్టర్ గానూ అదృష్టం పరీక్షించుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

రామ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన జగడం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ధనరాజ్. అందుల్లో అతను పోషించిన నాంపల్లి సత్తి పాత్ర బాగా పేలింది. ఆ తరువాత అల్లు అర్జున్ హీరోగా నటించిన పరుగు సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలోనూ కడుపుబ్బా నవ్వించాడు ధన్ రాజ్. యువత, గోపి గోపిక గోదావరి, పిల్ల జమీందార్, కెమెరామెన్ గంగతో రాంబాబు, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల.. ఇలా దాదాపు 80కు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. మధ్యలో జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టి టీమ్ లీడర్ దాకా ఎదిగాడు. ఇక ‘బుజ్జీ ఇలారా’ సినిమాతో హీరోగానూ మెప్పించిన రామం రాఘవం సినిమాతో దర్శకుడిగానూ మెప్పించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న ధనరాజ్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. ఒకానొక సమయంలో తల్లి క్యాన్సర్ తో చనిపోతే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు అతని దగ్గర చిల్లిగవ్వ లేదట. అలాంటి క్లిష్ట సమయంలో ధన్ రాజ్ భార్య శిరీషనే తన బంగారం మొత్తం అతనికి ఇచ్చేసిందట. ఈ విషయాన్ని ఆమెనే ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది.
‘ధనరాజ్‌ది విజయవాడ.నాది ఖమ్మం. నేను స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ ని. ధనరాజ్ ఫిలిం నగర్ లో ఒక డ్యాన్స్ స్టూడియో పెట్టినప్పుడు టీచర్ కోసం వెతుకుతున్నారు. అప్పుడే నన్ను మొదటి సారిగా కలిశాడు. కానీ నేను పరిచయమైన రోజే అతడి అమ్మ క్యాన్సర్ తో కన్నుమూసింది. కానీ దీనిని కూడా ధన్ రాజ్ చాలా పాజిటివ్ గా ఫీల్ అయ్యాడు. తన తల్లి వెళ్లిపోతూ నన్ను అతడికి ఇచ్చిందని ధనరాజ్ ఫీలయ్యాడు.తల్లి అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బు లేకపోతే నా దగ్గరున్న బంగారం ఇచ్చేశాను. మాది ప్రేమ వివాహం. అది కూడా నేనే ప్లాన్ చేశాను.రేపు మన పెళ్లి అనగానే సరేనని తలూపాడు.ఇంట్లో వాళ్లను కాదని 15 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లయిన మూడో రోజే జగడం సినిమా విడుదలైంది. అక్కడి నుంచి ధనరాజ్ కు సినిమా అవకాశాలు పెరిగాయి. మంచి గుర్తింపు కూడా వచ్చింది’
‘సామాజిక మాధ్యమాల్లో మా గురించి ఏవేవో పుకార్లు రాస్తుంటారు. ఆ మధ్య మేము రోడ్డున పడ్డామని, ఇల్లు కూడా అమ్మేశామని ప్రచారం చేశారు. విడాకులు తీసుకుంటున్నట్లు కూడా పోస్టులు పెట్టారు. మా మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి.అంతేకానీ విడాకులు తీసుకునేంత సీన్ ఏం లేదు’ అని అంటోంది ధన్ రాజ్ భార్య శిరీష.
ఫ్యామిలీతో జబర్దస్త్ ధన్ రాజ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




