AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC NET 2026 Schedule: యూజీసీ నెట్‌ జూన్‌ 2026 పరీక్ష తేదీలు ఖరారు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

UGC NET 2026 Admit Cards: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్) 2026 పరీక్షలు జూన్ 22 నుంచి మొదలవనున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఎన్టీయే విడుదల చేసింది. యూజీసీ నెట్‌ 2026 జూన్‌ సెషన్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..

UGC NET 2026 Schedule: యూజీసీ నెట్‌ జూన్‌ 2026 పరీక్ష తేదీలు ఖరారు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే
UGC NET Admit Cards Download
Srilakshmi C
|

Updated on: Jun 18, 2026 | 7:56 AM

Share

హైదరాబాద్‌, జూన్‌ 18:  షెడ్యూల్ ప్రకారం జూన్‌ 22, 23, 24, 25, 29, 30 తేదీలలో రోజుకు రెండు షిఫ్టుల్లో యూజీసీ నెట్ ఆన్‌లైన్‌ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. UGC NET 2026 అడ్మిట్ కార్డులో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదివి, పరీక్ష సమయంలో వాటిని పాటించాలని NTA అభ్యర్థులకు సూచించింది. అడ్మిట్ కార్డు లేకుండా ఏ అభ్యర్థినీ పరీక్షా హాలులోకి అనుమతించరని తెలిపింది. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఉపయోగపడే ఈ పరీక్షను మొత్తం 87 సబ్జెక్టులకు నిర్వహిస్తారు. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు. సీబీటీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. అబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటుంది. మొత్తం 3 గంటల వ్యవధిలో ఒకేసారి రెండు పేపర్లకు పరీక్ష రాయవల్సి ఉంటుంది.

యూజీసీ నెట్‌ జూన్‌ 2026 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అభ్యర్ధులకు ముఖ్యమైన సూచనలు

  • తనిఖీ, నమోదు లాంఛనాలను పూర్తి చేయడానికి అభ్యర్ధులు పరీక్ష ప్రారంభానికి రెండు గంటల ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరు కావాలి.
  • పరీక్ష ప్రారంభం కావడానికి 30 నిమిషాల ముందు రిజిస్ట్రేషన్ డెస్క్ మూసివేస్తారు.
  • అక్రమాలకు పాల్పడే అభ్యర్థుల ఫలితాలు రద్దు చేస్తారు.
  • తమకు కేటాయించిన కేంద్రం కాకుండా వేరే కేంద్రం నుండి పరీక్షకు హాజరైన లేదా తమ తరపున వేరొకరిని పరీక్ష రాయడానికి అనుమతించిన అభ్యర్థుల ఫలితాలు రద్దు చేస్తారు.

అభ్యర్థులు ఈ క్రింది పత్రాలను పరీక్షా కేంద్రానికి తీసుకురావాలి

NTA వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్న UGC NET 2026 అడ్మిట్ కార్డ్ యొక్క ప్రింటెడ్ కాపీ, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు (దరఖాస్తు ఫారంలో అప్‌లోడ్ చేసినవి మాత్రమే), ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఫోటో గుర్తింపు పత్రం, PwD/PwBD కేటగిరీ కింద సడలింపును క్లెయిమ్ చేస్తున్నట్లయితే PwD/PwBD సర్టిఫికేట్ తమతోపాటు తప్పనిసరిగా తీసుకురావాలి. అభ్యర్థులు తమకు కేటాయించిన కంప్యూటర్‌లో ఉన్న ప్రశ్నపత్రం తాము ఎంచుకున్న సబ్జెక్టుకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే ఇన్విజిలేటర్లకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా తెలియజేయాలి.

ఇవి కూడా చదవండి

యూజీసీ నెట్‌ జూన్‌ 2026 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ ఇంట్లో తులసి మొక్క ఉందా..? అయితే, తప్పులు అస్సలు చేయొద్దు..
మీ ఇంట్లో తులసి మొక్క ఉందా..? అయితే, తప్పులు అస్సలు చేయొద్దు..
శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీల బంద్.. ఎందుకంటే?
శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీల బంద్.. ఎందుకంటే?
ఆ హీరోయిన్ షూటింగ్ నుంచి పారిపోయింది..
ఆ హీరోయిన్ షూటింగ్ నుంచి పారిపోయింది..
రేషన్ కార్డు నెంబర్ మర్చిపోయారా..? సింపుల్‌గా ఇలా తెలుసుకోండి..
రేషన్ కార్డు నెంబర్ మర్చిపోయారా..? సింపుల్‌గా ఇలా తెలుసుకోండి..
'టాక్సిక్' లో రెచ్చిపోయి నటించిన కియారా.. రెమ్యునరేషన్ ఎంతంటే?
'టాక్సిక్' లో రెచ్చిపోయి నటించిన కియారా.. రెమ్యునరేషన్ ఎంతంటే?
పర్సెంటేజ్ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చిందా..?
పర్సెంటేజ్ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చిందా..?
జట్టులో మార్పులు చేయాల్సి వస్తే మొదట సంజూనే టార్గెట్ చేస్తారా?
జట్టులో మార్పులు చేయాల్సి వస్తే మొదట సంజూనే టార్గెట్ చేస్తారా?
రోజూ ఉదయాన్నే తింటే.. 150 ఏళ్లు బలంగా ఉంటారు! తాతల నాటి సీక్రెట్‌
రోజూ ఉదయాన్నే తింటే.. 150 ఏళ్లు బలంగా ఉంటారు! తాతల నాటి సీక్రెట్‌
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన శ్వేతనాగు
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన శ్వేతనాగు
ఈ ఫొటోలో ఉన్న ఇద్దరూ.. తెలుగులో క్రేజీ దర్శకులు..
ఈ ఫొటోలో ఉన్న ఇద్దరూ.. తెలుగులో క్రేజీ దర్శకులు..