AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turmeric: పసుపులో ఆ రెండు కలిపితేనే అది పవర్ ఫుల్.. లేదంటే మీ లివర్ దాన్ని బయటకు పంపేస్తుంది!

పసుపును మనం సహజమైన యాంటీబయాటిక్ అని, గొప్ప యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అని నమ్ముతాం. కానీ, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ పూజా రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మనం పసుపును విడిగా తీసుకుంటే అందులోని ప్రయోజనాలు శరీరానికి 1% కూడా అందవు. పసుపులోని ప్రధాన సమ్మేళనమైన 'కర్కుమిన్'ను గ్రహించే శక్తి మన శరీరానికి చాలా తక్కువగా ఉండటమే దీనికి కారణం. మనం పసుపు తిన్న వెంటనే మన కాలేయం (Liver) దానిని రక్తంలోకి చేరకముందే విచ్ఛిన్నం చేసి బయటకు పంపిస్తుంది.

Turmeric: పసుపులో ఆ రెండు కలిపితేనే అది పవర్ ఫుల్.. లేదంటే మీ లివర్ దాన్ని బయటకు పంపేస్తుంది!
Turmeric Absorption Tips
Bhavani
|

Updated on: Feb 03, 2026 | 7:01 PM

Share

పసుపు తన పూర్తి స్థాయి ప్రభావాన్ని చూపించాలంటే దానికి తోడుగా కొన్ని పదార్థాలు అవసరమని సైన్స్ చెబుతోంది. డాక్టర్ పూజా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో పసుపు గ్రహణశక్తిని పెంచే మార్గాలను వివరించారు. మన అమ్మమ్మల కాలం నాటి పసుపు, మిరియాల పొడి నెయ్యి కాంబినేషన్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పుడు ఆధునిక వైద్య పరిశోధనల్లో కూడా నిరూపితమైంది. కేవలం ఒక చిటికెడు మిరియాల పొడి చేర్చడం వల్ల పసుపు పనితీరు 20 రెట్లు పెరుగుతుందని ఆమె చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

పసుపు ప్రయోజనాలు పెరగాలంటే ఇవి తప్పనిసరి:

మిరియాల పొడి : పసుపును మిరియాల పొడితో కలిపి తీసుకుంటే, శరీరంలో దాని గ్రహణశక్తి ఏకంగా 100 శాతం పెరుగుతుంది. మిరియాల్లో ఉండే ‘పైపెరిన్’ అనే పదార్థం, లివర్ కర్కుమిన్‌ను విచ్ఛిన్నం చేయకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల పసుపు నేరుగా రక్తంలోకి ప్రవేశిస్తుంది.

కొవ్వు పదార్థాలు : కర్కుమిన్ నీటిలో కరగదు, కేవలం కొవ్వులో మాత్రమే కరుగుతుంది. కాబట్టి పసుపును నెయ్యి లేదా కొబ్బరి నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిపి తీసుకున్నప్పుడు మాత్రమే అది శరీరానికి అందుతుంది.

ప్రాచీన విజ్ఞానం: అందుకే మన పెద్దలు పసుపును కూరల్లో నూనెతో వేయించడం లేదా పాలలో నెయ్యి, మిరియాల పొడి వేసి ఇచ్చేవారు. ఈ మూడు కలిసినప్పుడు అది ఒక శక్తివంతమైన ఔషధంగా మారుతుంది.

ఇకపై పసుపు పాలు తాగినా లేదా కూరల్లో వాడినా, అందులో ఒక చిటికెడు మిరియాల పొడి కొద్దిగా నెయ్యి ఉండేలా చూసుకోండి. అప్పుడే పసుపులోని అసలైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మీ చర్మానికి, ఆరోగ్యానికి అందుతాయి.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఏదైనా ఆరోగ్య సంబంధిత మార్పుల కోసం నిపుణులను సంప్రదించండి.

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.