టీబీజీకేఎస్ చీలిక..బీజేపీ వ్యూహమేనా?

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) నుంచి తాను పూర్తిగా వైదొలగుతున్నట్లు ఆ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెంగర్ల మల్లయ్య ప్రకటించారు. యూనియన్‌ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రాజీనామా లేఖను అందజేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేరు పెట్టి పెద్ద చేసిన సంఘం నుంచి వైదొలగడం బాధగా ఉన్నా.. తప్పడం లేదన్నారు. సింగరేణి సంస్థలో 2003లో టీబీజీకేఎస్‌ పురుడు పోసుకుందని, అప్పటి నుంచి తాను సంస్థలో కీలక నాయ కుడిగా పని […]

టీబీజీకేఎస్ చీలిక..బీజేపీ వ్యూహమేనా?
TGBKS founder resigns and to join BMS
Follow us

|

Updated on: Sep 15, 2019 | 6:59 AM

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) నుంచి తాను పూర్తిగా వైదొలగుతున్నట్లు ఆ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెంగర్ల మల్లయ్య ప్రకటించారు. యూనియన్‌ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రాజీనామా లేఖను అందజేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేరు పెట్టి పెద్ద చేసిన సంఘం నుంచి వైదొలగడం బాధగా ఉన్నా.. తప్పడం లేదన్నారు. సింగరేణి సంస్థలో 2003లో టీబీజీకేఎస్‌ పురుడు పోసుకుందని, అప్పటి నుంచి తాను సంస్థలో కీలక నాయ కుడిగా పని చేస్తున్నానని చెప్పారు. సింగరేణిలో ఒంటి చేత్తో సంఘాన్ని గెలిపించి గులాబీ జెండా ఎగురవేశామని గుర్తు చేశారు. అయినా.. సంఘంలో తనకే స్థానం లేకుండా పోయిందని వాపోయారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి చట్టబద్ధత లేదని జూన్‌ 21న ఓ వలసవాది ప్రకటించి తన స్థానమేమిటో తెలియజేశారని, ఈ విషయం తనకు ఎంతో బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు.  కాగా, మల్లయ్యతో పాటు ఎనిమిది మంది ముఖ్య నాయకులు కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

ఈ సంఘటనలో బీజేపీ పాత్ర ఉంది అనేది రాజకీయ పండితుల అభిప్రాయం. కేంద్రంలో తనకు ఎదురు లేని రీతిలో మెజారిటీని సాధించిన బీజేపీ… ఇప్పుడు దక్షాణాది రాష్ట్రలపై దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసి..అధికారం చేపట్టాలని ఉవ్వీళ్లూరుతుంది. ఇప్పటికే వలసలకు ఓపెన్ డోర్లు తెరిచిపెట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్‌ బడా నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ తమ పార్టీలోకి రావాల్సిందిగా కోరుతున్నారు. కమలనాథులు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు ఫలితాలనే ఇస్తున్నాయని చెప్పాలి. ఈ వ్యూహాల్లో భాగంగా సింగరేణి కాలరీస్ లో టీఆర్ ఎస్ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)లో కలమం పార్టీ ఏకంగా చీలికనే తెచ్చేసింది. టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా ఉన్న కెంగర్ల మల్లయ్య ఏకంగా తన పదవికి రాజీనామా చేయడంతో పాటుగా సంఘాన్ని రెండు ముక్కలు చేసేశారు.

బయటకు మల్లయ్యకు ఏదో పార్టీలో అవమానం జరిగిన కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకుందన్న వాదనలు వినిపిస్తున్నా… లోగుట్టు మాత్రం చాలానే ఉందన్న మాట వినిపిస్తోంది. బీజేపీ అధిష్ఠానం అండతోనే మల్లయ్య తన పదవికి రాజీనామా చేయడంతో పాటుగా టీబీజీకేఎస్ ను ఒక్క దెబ్బతో రెండు ముక్కలు చేసేశారన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. సాధారణంగా తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన పార్టీగా టీఆర్ ఎస్ కు సింగరేణిలో తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే ఇప్పుడు టీబీజీకేఎస్ అధ్యక్షుడు మల్లయ్య కేంద్రంగా బీజేపీ కొట్టిన దెబ్బకు టీఆర్‌ఎస్ డిఫెన్స్‌లో పడిందన్న వాదన వినిపిస్తోంది.

ఇటీవలే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తో మల్లయ్య భేటీ అయ్యారని- సింగరేణిలో టీఆర్‌ఎస్‌ను దెబ్బ కొడితే… మంచి భవిష్యత్తు అందిస్తామంటూ లక్ష్మణ్ చేసినట్టు వార్తలు వెలువడ్డాయి.   త్వరలోనే ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ లో మల్లయ్య చేరనున్నారని ఆ వెంటనే  వచ్చే నెలలో  జరిగే సింగరేణి ఎన్నికల్లో… మల్లయ్య ద్వారా సత్తా చాటేందకు బీజేపీ పక్కా వ్యూహం రచించిందన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. చూడాలి బీజేపీ ముందు..ముందు తెలంగాణలో ఎలా పావులు కదుపుతుందో!

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!