చంద్రబాబుపై సినీ రచయిత కోన వెంకట్ తీవ్ర విమర్శలు

సినీ రచయిత కోన వెంకట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘సినిమాల్లో ఎన్నో విలన్‌ పాత్రలు సృష్టించాను. ఒక రచయితగా కామెడీ విలన్లతో పాటు క్రూర విలన్‌ పాత్రలనూ రాసుకున్నాను. కానీ సీఎం చంద్రబాబునాయుడు వంటి విలన్‌ పాత్రను ఇంతవరకు నేను సృష్టించలేకపోయా. బహుశా ఇక సృష్టించలేను కూడా. ఎందుకంటే బాబు రాజకీయం మొత్తం వెన్నుపోట్లమయమే. పిల్లనిచ్చిన మామ ఎన్‌టీఆర్‌ మొదలు… 2014 ఎన్నికల్లో సీనియర్‌ నేత అని నమ్మి ఓట్లేసిన ప్రజలందరికీ […]

చంద్రబాబుపై సినీ రచయిత కోన వెంకట్ తీవ్ర విమర్శలు
Follow us

| Edited By: Vijay K

Updated on: Mar 25, 2019 | 5:59 PM

సినీ రచయిత కోన వెంకట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘సినిమాల్లో ఎన్నో విలన్‌ పాత్రలు సృష్టించాను. ఒక రచయితగా కామెడీ విలన్లతో పాటు క్రూర విలన్‌ పాత్రలనూ రాసుకున్నాను. కానీ సీఎం చంద్రబాబునాయుడు వంటి విలన్‌ పాత్రను ఇంతవరకు నేను సృష్టించలేకపోయా. బహుశా ఇక సృష్టించలేను కూడా. ఎందుకంటే బాబు రాజకీయం మొత్తం వెన్నుపోట్లమయమే. పిల్లనిచ్చిన మామ ఎన్‌టీఆర్‌ మొదలు… 2014 ఎన్నికల్లో సీనియర్‌ నేత అని నమ్మి ఓట్లేసిన ప్రజలందరికీ ఆయన వెన్నుపోటే పొడిచారు. నమ్మక ద్రోహానికి చంద్రబాబు నిలువెత్తు రూపం. సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు పరిస్థితి ఇప్పుడు ఏమిటి? ఆయన బతికున్నారా లేదా? అని తెలియని పరిస్థితికి తెచ్చాడు. రక్త సంబంధీకులను కూడా మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది’ అని కోన వెంకట్ తీవ్రంగా విమర్శించారు.

నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. కానీ కులాంతర వివాహం చేసుకున్నాను. నా పెద్ద కుమార్తె కూడా బ్రాహ్మణేతరుణ్ని పెళ్లాడింది. రచయితగా నాకు కలం తప్ప కులం లేదు.. కానీ చంద్రబాబు బ్రాహ్మణులను వంచిస్తున్నారు. దీంతో కడుపు మండి మాట్లాడుతున్నా. 2014 ఎన్నికల్లోనూ, ప్రస్తుత ఎన్నికల్లోనూ చంద్రబాబు బ్రాహ్మణులకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు ఆయనకు ఓటేందుకు వేయాలి. జంధ్యం ధరించి, గాయత్రీ మంత్రం చదివే ప్రతి బాహ్మణుడూ.. టీడీపీకి ఓటేయొద్దని కోరుతున్నానని కోన వెంకట్ తెలిపారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..