AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. పార్టీలోకి స్వయంగా ఆహ్వానించనున్న కేటీఆర్, హరీష్‌ రావు!

శ్రీపరాభవ నామ సంవత్సరంలో పరాభవం జరగని పార్టీలోకి వెళ్తానన్న జీవన్ రెడ్డి, బీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లో తనకు గౌరవం ఇవ్వడం లేదని.. తన సీనియార్టీని గుర్తించడం లేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. తాజా రాజకీయాలపై చర్చించారు.

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. పార్టీలోకి స్వయంగా ఆహ్వానించనున్న కేటీఆర్, హరీష్‌ రావు!
Ktr, Harish Rao, Jeevan Reddy
Balaraju Goud
|

Updated on: Apr 08, 2026 | 9:39 PM

Share

శ్రీపరాభవ నామ సంవత్సరంలో పరాభవం జరగని పార్టీలోకి వెళ్తానన్న జీవన్ రెడ్డి, బీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జీవన్ రెడ్డిని స్వయంగా కలిసి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించాలని కేటీఆర్, హరీష్ రావు.

కాంగ్రెస్‌లో తనకు గౌరవం ఇవ్వడం లేదని.. తన సీనియార్టీని గుర్తించడం లేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. తాజా రాజకీయాలపై చర్చించారు. గురువారం (ఏప్రిల్ 09) కరీంనగర్ పర్యటన అనంతరం జగిత్యాల వెళ్లి జీవన్ రెడ్డితో భేటీ కానున్నారు. కేటీఆర్ తోపాటు మంత్రి హరీష్ రావు జీవన్‌రెడ్డి సమావేశమై, బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో జీవన్ రెడ్డి టచ్‌లో ఉన్నారు. ఒక దఫా ప్రాథమిక చర్చలు కూడా ముగిసినట్లు జీవన్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. జీవన్ రెడ్డికి పార్టీలో కీలక పదవి.. ఆయన కోడలికి జగిత్యాల టికెట్ లాంటి అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి సీనియార్టీకి తగిన పదవితో పాటు వచ్చే ఎన్నికల్లో ఆయన కోరిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ అంగీకరించిందన్న టాక్ వినిపిస్తోంది.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో విభేదాల కారణంగా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పాక తన అనుచరులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. కొంత మంది అనుచరులు బీజేపీ వైపు వెళ్దామని సలహా ఇచ్చినప్పటికీ తనకున్న ముస్లిం అనుచరులు, మైనార్టీ ఓటు బ్యాంక్‌ దృష్ట్యా జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కేటీఆర్‌, హరీష్ రావులతో చర్చల అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరే తేదీ ఖరారు కానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కాఫీ తాగిన వెంటనే బాత్రూంలోకి పరిగెడుతున్నారా?.. అసలు విషయమిదే
కాఫీ తాగిన వెంటనే బాత్రూంలోకి పరిగెడుతున్నారా?.. అసలు విషయమిదే
యవ్వనశక్తి, రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరికాయ చుందా
యవ్వనశక్తి, రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరికాయ చుందా
వన్డే హిస్టరీలో ఆల్‌టైం టాప్ 7 భారీ స్కోర్లు
వన్డే హిస్టరీలో ఆల్‌టైం టాప్ 7 భారీ స్కోర్లు
నోట్లో వెన్నలా కరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ కమ్మటి పెరుగన్నం..!
నోట్లో వెన్నలా కరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ కమ్మటి పెరుగన్నం..!
కెమెరా కనిపిస్తే చాలు.. హీరోయిన్లు ఇలా ఎందుకు చేస్తున్నారు?
కెమెరా కనిపిస్తే చాలు.. హీరోయిన్లు ఇలా ఎందుకు చేస్తున్నారు?
నాని 'ది ప్యారడైజ్' కి సంపూర్ణేష్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
నాని 'ది ప్యారడైజ్' కి సంపూర్ణేష్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కాదు.. మరో వ్యాపారంలోకి ఇండియన్ ఆయిల్..
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కాదు.. మరో వ్యాపారంలోకి ఇండియన్ ఆయిల్..
రవి అనుగ్రహం.. ఈ రాశులకు రాజయోగం.. కెరీర్, ఆర్థికంగా పురోగతి
రవి అనుగ్రహం.. ఈ రాశులకు రాజయోగం.. కెరీర్, ఆర్థికంగా పురోగతి
చేపలు పట్టేందుకు కుంటలో దిగి శవమై తేలాడు
చేపలు పట్టేందుకు కుంటలో దిగి శవమై తేలాడు
పులి, మేక, గడ్డి.. రైతు నది ఎలా దాటాలి? మీ తెలివికి బస్తీమే సవాల్
పులి, మేక, గడ్డి.. రైతు నది ఎలా దాటాలి? మీ తెలివికి బస్తీమే సవాల్